ETV Bharat / bharat

దివ్యాంగులతో పోలింగ్​ కేంద్రాలు- ఎన్నికల నిర్వహణ మొత్తం వారిదే- అదే కారణమట! - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Disabled Persons In Election Duties : పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులే నడిపించే విధంగా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ దివ్యాంగ పోలింగ్ కేంద్రాలు మహారాష్ట్రలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనుంది. అసలు ఈసీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? అందుకు గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Disabled Persons In Election Duties
Disabled Persons In Election Duties
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 12:29 PM IST

Disabled Persons In Election Duties : సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించనుంది. ప్రత్యేకంగా దివ్యాంగులు పనిచేసేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ దివ్యాంగులు ఎవరికన్నా తక్కువకాదని నిరూపించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈసీ పేర్కొంది.

ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొ దివ్యాంగ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ఎన్నికల సంఘం. పోలింగ్‌ కేంద్రంలో దివ్యాంగులే అన్ని విధులు నిర్వర్తించనున్నారు. దివ్యాంగులు కూడా ఏ పనినైనా చేయగలరనే సందేశాన్ని సమాజానికి ఇచ్చేందుకే ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి దేవేంద్ర కట్కే తెలిపారు. దివ్యాంగ పోలింగ్ కేంద్రంలో నలుగురు దివ్యాంగ సిబ్బంది, వీరికి మరో ఇద్దరు సహకరిస్తారని పేర్కొన్నారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కొక్కటి చొప్పున తొమ్మిది దివ్యాంగ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

వారికి గుణపాఠంగా ఈ పోలింగ్ కేంద్రాలు
ఎన్నికల విధుల నుంచి సెలవు కోరేవారికి దివ్యాంగ పోలింగ్ కేంద్రాలు ఓ గుణపాఠమని ఎన్నికల అధికారి దేవేంద్ర కట్కే తెలిపారు. 'ఓటింగ్​కు చాలా రోజుల ముందు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. వివిధ శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరుతున్నారు. అందుకే మేము దివ్యాంగ పోలింగ్ బూత్​లను ఏర్పాటు చేయనున్నాం. ఈ పోలింగ్ కేంద్రాన్ని చూసి ఎన్నికల విధుల నుంచి తప్పించుకోవాలనుకునేవారు గుణపాఠం నేర్చుకుంటారు. అంతేకాకుండా పురుషులు, మహిళలు సమానమని చాటిచెప్పేందుకు మహిళా సిబ్బందితో ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాట్లు చేస్తున్నాం' అని ఎన్నికల అధికారి దేవేంద్ర కట్కే తెలిపారు.

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికలు జరిగాయి. ఇంకా మరో ఆరు దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ అన్నీతానై తిరుగుతున్నారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రచారం చేస్తున్నారు.

ఐటీ హబ్​లో నీటి సంక్షోభం- ఎన్నికలపై తీవ్ర ప్రభావం- ఓటర్లకు ముఖం చాటేస్తున్న అభ్యర్థులు - Lok Sabha Election 2024

PHD స్టూడెంట్​కు వడోదర టికెట్- యంగెస్ట్ బీజేపీ అభ్యర్థిగా రికార్డ్​- 10లక్షల మెజారిటీ టార్గెట్! - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.