ETV Bharat / bharat

'కావాలనే కేజ్రీవాల్ అవన్నీ తింటున్నారు- అంతా బెయిల్ కోసమే!' - Kejriwal Arrest

Delhi Case Kejriwal : తిహాడ్ జైలులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లను తెగ తినేస్తున్నారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తెలిపింది. బ్లడ్ షుగర్‌ను చేతులారా పెంచుకుని, బెయిల్ పొందాలనే దురుద్దేశంతో ఆప్ అధినేత ఉన్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

kejriwal delhi case
kejriwal delhi case
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 7:15 PM IST

Updated : Apr 18, 2024, 7:24 PM IST

Delhi Case Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లను తెగ తినేస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రౌస్ అవెన్యూ కోర్టుకు గురువారం తెలిపింది. "టైప్ 2 మధుమేహం ఉందనే విషయం తెలిసినప్పటికీ బెయిల్ కోసం సాకును సృష్టించడానికి రోజూ ఇంటి నుంచి మామిడి పండ్లు, స్వీట్లను తెప్పించుకుని మరీ కేజ్రీవాల్ తింటున్నారు. చ‌క్కెర‌తో కూడిన టీ తాగుతున్నారు. ఆలూ పూరీ తింటున్నారు" అని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. బ్ల‌డ్ షుగ‌ర్ పెరిగితే బెయిల్ అడ‌గాల‌నేది కేజ్రీవాల్ ప్రణాళిక అని ఆరోపించింది.

'షుగర్ లెవెల్స్‌ ప‌డిపోతున్నాయ్'
"నా షుగర్ లెవెల్స్‌ ప‌డిపోతున్నాయి. క్ర‌మం త‌ప్ప‌కుండా వాటిని త‌నిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నా వ్య‌క్తిగ‌త వైద్యుడిని సంప్రదించేందుకు అనుమ‌తి ఇవ్వండి" అంటూ తాజాగా కోర్టులో కేజ్రీవాల్ పిటిష‌న్‌ దాఖ‌లు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, జైలులో కేజ్రీవాల్ పాటిస్తున్న డైట్ ఛార్ట్‌ను తమకు స‌మ‌ర్పించాల‌ని జైలు అధికారులను ఆదేశించింది. త‌దుప‌రి వాద‌న‌లు శుక్ర‌వారం వింటామ‌ని తెలిపింది. మ‌రోవైపు, ఈడీ వాద‌న‌ను కేజ్రీవాల్ త‌ర‌ఫు న్యాయ‌వాది వివేక్ జైన్ కొట్టిపారేశారు. ఈడీ చేసేవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమేనని ఆయన కోర్టుకు తెలిపారు.

కేజ్రీవాల్‌ను చంపడానికి కుట్ర : అతిషి
బ్లడ్ షుగర్‌ను పెంచుకునేందుకే కేజ్రీవాల్ తీపి పదార్థాలను తింటున్నారని ఈడీ చేసిన ఆరోపణలపై ఆప్ సీనియర్ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ స్పందించారు. కేజ్రీవాల్‌కు ఇంటి ఆహారాన్ని ఆపేసి, వైద్య చికిత్సకు అనుమతిని నిరాకరించి చంపేయడానికి కుట్ర జరుగుతోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేజ్రీవాల్ డైట్ గురించి కోర్టుకు ఈడీ అబద్ధాలు చెబుతోందన్నారు. కేజ్రీవాల్ కృత్రిమ స్వీటెనర్‌ను తీసుకుంటున్నారని ఈడీ వినిపిస్తున్న వాదనల్లో నిజం లేదని తేల్చిచెప్పారు.

షుగర్ లెవల్స్ తగ్గితే ప్రాణానికే ప్రమాదకరం కాబట్టి అటువంటి సమయంలో అరటిపండు లేదా ఏదైనా చాక్లెట్ తినమని డాక్టర్లు సలహా ఇస్తుంటారని ఆమె పేర్కొన్నారు. "ఈడీ కనీసం దేవుడికైనా భయపడాలి. అరవింద్ కేజ్రీవాల్ నవరాత్రుల మొదటి రోజున మాత్రమే ఆలూ పూరీ తిన్నారు" అని ఆతిశీ తెలిపారు. "గత కొన్ని రోజులుగా కేజ్రీవాల్ షుగర్ లెవల్ 300 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంది. అయినా తిహాడ్ జైలు అధికారులు ఇన్సులిన్ తీసుకునేందుకు కేజ్రీవాల్‌కు అనుమతి ఇవ్వడం లేదు. ఇంటి ఫుడ్‌ను కూడా ఆపేసి ఆయనను చంపడానికి కుట్ర పన్నారు" అని ఆతిశీ ఆరోపించారు.

'జైలులో ఉన్నవారు రాజకీయ పత్రాలపై సంతకాలు చేయలేరు'- ఆప్​ ఆరోపణలపై జైళ్ల శాఖ కీలక వ్యాఖ్యలు

'వారితో కలిసి కేజ్రీవాల్​ కుట్ర- లిక్కర్​ స్కామ్​లో అరెస్ట్​ చట్టబద్ధమే'- దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

Last Updated : Apr 18, 2024, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.