ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​- 4% పెంపు- 50 శాతానికి చేరిన DA - DA Hike To Govt Employees

DA Hike Central Government Employees : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు చెప్పింది. డీఏను 4 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది.

DA Hike To Central Government Employees
DA Hike To Central Government Employees
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 8:21 PM IST

Updated : Mar 7, 2024, 10:55 PM IST

DA Hike Central Government Employees : సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు వచ్చేసింది. వారి డియర్​నెస్​ అలొవెన్స్​ (డీఏ) 4 శాతం పెరిగింది. దీంతో ఇప్పటివరకు ఉన్న 46 శాతం డీఏ 50 శాతానికి చేరుకున్నట్లయ్యింది. 2024, జనవరి 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, ఈ తాజా నిర్ణయంతో దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.

తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్‌ వెల్లడించారు. డీఏ/డీఆర్‌ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ.12,869 కోట్ల అదనపు భారం పడనున్నట్లు అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి దీని ప్రభావం రూ.15,014 కోట్లు ఉండవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

  • భారత సైన్యం, ఇండియన్ కోస్ట్ గార్డ్ అవసరాల కోసం 34 కొత్త ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ హెలికాప్టర్ల కొనుగోళ్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆర్మీకి 25, ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు 9 చొప్పున హెలికాప్టర్లను సమకూర్చనున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీటిని తయారుచేయనుంది.
  • భారత్‌లో కృత్రిమ మేధ అభివృద్ధి, పరిశోధనల కోసం రానున్న 5 ఏళ్లలో రూ.10,372 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేయనున్నారు. ఇందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  • ఈశాన్య భారతంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు 'ఉన్నతి' పథకం కింద రూ.10,037 కోట్లతో రూపొందించిన బడ్జెట్​కూ కేబినెట్​ ఆమోదం లభించింది.
  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో ముడి జనపనారకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.285 పెంచారు. దీంతో మొత్తం ధర రూ.5,335కి చేరింది. ఈ నిర్ణయంతో తూర్పు రాష్ట్రాలుస ముఖ్యంగా బంగాల్ రైతులకు ఎంతో మేలు జరుగనుందని మంత్రి చెప్పారు.
  • గోవా శాసనసభలో షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పచ్చజెండా ఊపింది కేంద్ర కేబినెట్​. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం ఎస్టీలకు రిజర్వేషన్‌ సీట్లు లేవు. జనాభా ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Last Updated : Mar 7, 2024, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.