Cyclist Jaspreet Paul Record Latest : హిమాచల్‌ప్రదేశ్‌లో తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్న పరాశర్ రుషి ఆలయానికి సైక్లింగ్ చేసుకుంటూ వెళ్లారు ఓ వ్యక్తి. అది కూడా రెండున్నర అడుగుల మందంతో పేరుకుపోయి ఉన్న మంచుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఒంటరిగా ఈ సరికొత్త ఫీట్ సాధించి రికార్డు సృష్టించారు మండి నగరానికి చెందిన జస్ప్రీత్ పాల్.
ఎవరూ సాహంచని మార్గంలో!
ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం ఐదు గంటలకు మండి నుంచి బయలు దేరారు జస్ప్రీత్ పాల్. అయితే ఆయన పరాశర్ చేరుకోవడానికి ఎవరూ సాహంచని మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గాన్ని చాలా తక్కువ మంది మాత్రమే వినియోగిస్తారు. కానీ జస్ప్రీత్ అదే రూట్ ద్వారా ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు పరాశర్ రిషి ఆలయానికి చేరుకున్నారు.
కొన్ని చోట్ల సైకిల్ లాక్కెళ్లి!
పరాశర్ రుషి ఆలయానికి ఐదు కిలోమీటర్ల ముందు భారీగా మంచు పడడం మొదలైందని జస్ప్రీత్ చెప్పారు. మంచు కురుస్తున్న చోట సైకిల్ తొక్కవచ్చని చెప్పారు. కానీ మంచు మెత్తగా ఉన్న చోట సైకిల్ లాక్కెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అలానే సగం ప్రయాణం పూర్తి చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. హనోగి నుంచి బంధీ ప్రాంతానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు.
త్వరలో ఆ ప్రాంతాలకు కూడా
పరాశర్ రుషి ఆలయానికి తన సైకిల్ ప్రయాణం చాలా ఛాలెంజింగ్‌గా ఉందని జస్ప్రీత్ చెప్పారు. అనుకున్నది విజయవంతంగా పూర్తి చేశానని తెలిపారు. భవిష్యత్తులో సైకిల్‌పై కమ్రునాగ్, షైతాధర్, షికారీ దేవి కొండలకు వెళ్లాలనుకుంటున్నానని వెల్లడించారు. ఈ సీజన్‌లోనే ఆ లక్ష్యాలను కూడా నెరవేర్చుకుంటానని అన్నారు.
ఒక్కసారిగా షాకైన పూజారి!
అయితే జస్ప్రీత్ పాల్ సైకిల్‌పై పరాశర్ ఆలయం వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న పూజారితోపాటు స్థానికులు ఆశ్చర్యపోయారట. ప్రస్తుతం ప్రజలు కాలినడకన రాలేని చోట జస్ప్రీత్ సైకిల్‌పై ఇక్కడికి చేరుకోవడం ఆశ్చర్యంగా ఉందని పూజారి అమర్ సింగ్ తెలిపారు. పరాశర ఆలయం ఆవరణలో భారీగా మంచు కురుస్తున్నా, కొద్ది మంది మాత్రమే గుడిని సంరక్షిస్తున్నారని ఆయన చెప్పారు.
అనేక ఘనతలు జస్ప్రీత్ సొంతం
జస్ప్రీత్ పాల్ ఇప్పటికే అనేక ఘనతలు సాధించారు. గతేడాది జూన్ 23-26 మధ్య జరిగిన హిమాచల్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో జస్ప్రీత్ మూడో స్థానంలో నిలిచారు. ఫైర్‌ఫాక్స్-ఫైర్‌స్టార్మ్ ఛాలెంజ్ 2021లో దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీంతోపాటు పలు జిల్లాస్థాయి పోటీల్లో కూడా విజేతగా నిలిచారు. ఇప్పుడు మంచుపై సైక్లింగ్ చేసి మరో రికార్డు సృష్టించారు.
63ఏళ్ల వయసులో రోజూ 50కిమీ సైక్లింగ్- 100 రోజుల్లోనే 5వేల కిమీ పూర్తి, ఇండియా బుక్‌లో స్థానం
వెయిట్ లాస్ కోసం సైక్లింగ్ స్టార్ట్ చేస్తారా? ఎలాంటి సైకిల్ కొనాలి? గేర్స్ తప్పనిసరా?
28 రాష్ట్రాలు.. 25వేల కి.మీ సైకిల్ యాత్ర.. యువతి సోలో సాహసం వెనక కారణమిదే