ETV Bharat / bharat

'నత్తనడకన CBI అవినీతి కేసుల విచారణ! 6900 కేసులు పెండింగ్- కొన్నింట్లో 20ఏళ్లకుపైగా జాప్యం' - cvc report on cbi pending cases - CVC REPORT ON CBI PENDING CASES

CVC Report On CBI Pending Cases : సెంట్రల్​ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా సంచలన విషయాలు తెలిశాయి. సీబీఐ దర్యాప్తు చేసిన 6900 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్నట్లు నివేదిక పెర్కొంది. కొన్ని కేసుల్లో ప్రభుత్వ అధికారులు నిందితులుగా ఉన్నట్లు తెలిపింది. ఇక 500పైగా అవినీతి కేసులు 20 ఏళ్లకుపైగా పెండింగులో ఉన్నట్లు చెప్పింది. అయితే ఈ జాప్యానికి కారణాలను కూడా నివేదిక ఉటంకించింది. అవేంటంటే?

CVC Report On CBI Pending Cases
CVC Report On CBI Pending Cases (ANI, CVC)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 5:05 PM IST

CVC Report On CBI Pending Cases : సెంట్రల్​ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్​(సీబీఐ) దర్యాప్తు చేసిన 6,900పైగా అవినీతిలో కేసులు, వివిధ కోర్టుల్లో పెండింగ్​లో ఉన్నాయని సెంట్రల్​ విజిలెన్స్​ కమిషన్(సీవీసీ) వార్షిక నివేదికలో పేర్కొంది. అందులో 321 కేసులు 20ఏళ్లకు పైగా పెండింగులో ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా 658 అవినీతి కేసుల్లో సీబీఐ దర్యాప్తు పెండింగులో ఉందని, అందులో 48 కేసుల దర్యాప్తులో ఐదేళ్లకు పైగా కదలిక లేదని వెల్లడించింది.

సీవీసీ నివేదిక ప్రకారం- 2023 డిసెంబర్​ 31 వరకు వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతున్న 6903 కేసుల్లో, 1379 కేసులు దాదాపు ముడేళ్లుగా, 875 కేసులు మూడేళ్ల నుంచి ఐదేళ్లుగా పెండింగులో ఉన్నాయి. 2188 కేసులు ఐదేళ్ల నుంచి పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇక మరో 2100 కేసులు పదేళ్ల నుంచి 20ఏళ్లుగా పెండింగ్​లో ఉన్నాయి.

పెండింగ్ సమయం కేసుల సంఖ్య
3 ఏళ్ల లోపు1379
3-5 ఏళ్లు875
5-10 ఏళ్లు2188
10-20 ఏళ్లు2100
20 ఏళ్లకు పైగా361

సీబీఐ, వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు దాఖలు చేసిన 2,773 అప్పీళ్లు/రివిజన్‌ పిటిషన్లు, వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని సీవీసీ నివేదిక పేర్కొంది. ఇందులో 501 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగులో ఉన్నాయి.

  • 2ఏళ్ల లోపు పెండింగులో ఉన్న కేసులు- 2,554
  • 2-5ఏళ్లుగా పెండింగులో ఉన్న కేసులు- 2,172
  • 5-10ఏళ్లుగా పెండింగులో ఉన్న కేసులు- 3,850
  • 10-15ఏళ్లుగా పెండింగులో ఉన్న కేసులు- 2,558
  • 15-20ఏళ్లుగా పెండింగులో ఉన్న కేసులు- 1,138
  • 20 ఏళ్లుకు పైగా పెండింగులో ఉన్న కేసులు- 501

658 అవినీతి కేసుల్లో సీబీఐ దర్యాప్తు పెండింగులో ఉందని, అందులో 48 కేసుల దర్యాప్తులో ఐదేళ్లకు పైగా కదలిక లేదని వెల్లడించింది. ఇక, 3ఏళ్లకు పైగా 74 కేసులు, 2-3ఏళ్లుగా 75 కేసులు, 1-2ఏళ్లుగా 175 కేసుల్లో సీబీఐ దర్యాప్తు పెండింగులో ఉంది.

ఆలస్యానికి కారణాలివే!
అధిక పనిభారం, సిబ్బంది కొరత, లెటర్స్ రొగేటరీకి (ఎల్‌ఆర్‌) ప్రతిస్పందనలను పొందడంలో జాప్యం జరగడం వంటి కారణాలతో కేసులు పెండింగులో ఉన్నట్లు సీవీసీ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఆర్థిక నేరాలు, బ్యాంకు మోసాల కేసులలో భారీ రికార్డుల పరిశీలనకు ఎక్కువ సమయం పడుతోందని తెలిపింది. అంతేకాకుండా సుదూర ప్రాంతాల్లో ఉన్న సాక్షులను గుర్తించి, విచారించడానికి ఎక్కువ సమయం పట్టడం కూడా కేసులు జాప్యానికి కారణం అని చెప్పింది.
తాజా సీవీసీ నివేదిక ప్రకారం, 2023 డిసెంబర్ 31 నాటికి సీబీఐలో మంజూరైన 7,295 పోస్టుల్లో 1,610 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ ర్యాంకుల్లో 1,040, లా ఆఫీసర్లు 84, టెక్నికల్‌ ఆఫీసర్లు 53, మినిస్టీరియల్‌ సిబ్బంది 388, క్యాంటీన్‌ సిబ్బంది 45 ఖాళీలు ఉన్నాయి.

2023లో సీబీఐ 876 సాధారణ కేసులు/ప్రాథమిక విచారణలను నమోదు చేసింది. ఇందులో 91 కేసులను రాజ్యాంగ న్యాయస్థానాల ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తునకు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందుకున్న విజ్ఞప్తులపై 84 కేసులను నమోదు చేసింది.
ఇక 2023లో సీబీఐ 873 కేసుల్లో దర్యాప్తును పూర్తి చేసింది. ఇందులో 755 సాధారణ కేసులు, 118 ప్రాథమిక విచారణలను పూర్తి చేసింది. ఇదే కాలంలో సీబీఐ 552 అవినీతి కేసులు నమోదు చేయగా అందులో 674మంది ప్రభుత్వ ఉద్యోగులు(195 గెజెటెడ్ ఆఫీసర్లు) నిందితులుగా ఉన్నారు. విచారణ, నేరారోపణ వివరాలను తెలియజేస్తూ (అవినీతి నిరోధక చట్టం కేసులతో సహా) 636 కేసుల్లో కోర్టు తీర్పు అందిందని పేర్కొంది. ఇందులో 411 కేసుల్లో కన్విక్షన్​ తీర్పు వెలువడింది. 140 కేసుల్లో అక్విట్టల్​ తీర్పు వచ్చింది. 24 కేసులను కోర్టులు డిశ్చార్జ్‌ చేశాయి. 61 కేసులను కొన్ని కారణాల కోర్టులు డిస్పోజ్​ చేశాయి.

కేంద్రమంత్రుల్లో 99శాతం మంది కోటీశ్వరులే- అందుకోలేనంత ఎత్తులో పెమ్మసాని - ADR Report On Central Ministers

ADR Report On MPS Criminal Cases : 40 శాతం సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. YCP ఎంపీల్లో 13 మందిపై..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.