ETV Bharat / bharat

సాయంత్రం వేళ - క్రిస్పీ క్రిస్పీ 'కార్న్ సమోసా' - ఇంట్లోనే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి! - Corn Samosa Recipe

Spicy Corn Samosa Recipe : చాలా మంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్స్​లో సమోసా ఒకటి. ఇక సాయంకాలం ఒక కప్పు టీ తాగుతూ గరంగరం సమోసాలు తింటుంటే ఆ టేస్ట్​ వేరే లెవల్​. మరి మీరు కూడా ఇలాంటి ఫీలింగ్​ను పొందాలనుకుంటున్నారా? అయితే ఇంట్లో కార్న్​ సమోసా ప్రిపేర్​ చేసుకోండి.

How To Make Corn Samosa Recipe
Spicy Corn Samosa Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 1:54 PM IST

How To Make Corn Samosa Recipe in Telugu వాతావరణం కూల్​గా ఉన్నప్పుడు.. సాయంత్రం సమయంలో.. ఏదైనా వేడి వేడి స్నాక్ తినాలనిపిస్తుంది. దానికి కాంబినేషన్​గా ఓ కప్పు కాఫీ వేరే లెవల్​. అయితే ఈవెనింగ్​ స్నాక్స్​ అంటే గరంగరం సమోసాలు(Samosa) గుర్తుకు వస్తాయి. కాగా చాలా మంది సమోసా అంటే.. ఉల్లిపాయ సమోసా, ఆలు సమోసా మాత్రమే తిని ఉంటారు. ఇంట్లో కూడా వీటిని మాత్రమే చేస్తుంటారు. ఇక ఎప్పుడూ అవే తింటే బోర్​ కోడుతుంది. కాబట్టి ఈసారికి సూపర్ టేస్టీగా ఉండే కార్న్ సమోసా తయారు చేసుకోండి. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు :

  • ఉడికించిన మొక్కజొన్న గింజలు - 1 కప్పు
  • మైదా లేదా గోధుమపిండి - 1 కప్పు
  • పచ్చిమిర్చి - రెండు
  • సన్నగా తరిగిన అల్లం - చెంచా
  • జీలకర్రపొడి - అరచెంచా
  • మిరియాలపొడి - చెంచా
  • గరంమసాలా - చెంచాన్నర
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - తగినంత
  • కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు

ఇంట్లోనే ఈజీగా "మీఠా సమోసా" - టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

కార్న్ సమోసా తయారీ విధానం :

  • ముందుగా ఒక బౌల్​లో​ మైదా లేదా గోధుమపిండి తీసుకొని అందులో తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై కడాయి పెట్టి అందులో చెంచా నూనె వేసుకొని.. మొక్కజొన్న గింజలు, అల్లం తురుము, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి, గరంమసాలా, జీలకర్రపొడి, కొత్తిమీర తురుము.. ఇలా అన్నింటిని వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలపాటు వేయించుకోవాలి.
  • అనంతరం ముందుగా కలిపి పెట్టుకున్న పిండితో చిన్న చిన్న చపాతీల్లా చేసుకుని వాటిని సమోసాలా మాదిరిగా మడతపెట్టి అందులో వేయించిన మొక్కజొన్న గింజల మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసేయాలి.
  • తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని సమోసాలను వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆపై వాటిని అందులో వేసుకొని డీప్​ఫ్రై చేసుకోవాలి. అంతే.. క్రిస్పీ క్రిస్పీగా ఉండే నోరూరించే కార్న్ సమోసాలు రెడీ!
  • చల్ల చల్లని సాయంత్రం వేళ.. కప్పు చాయ్‌తో కలిపి కార్న్ సమోసాలను జత చేసి తింటే.. టేస్ట్​ అద్దిరిపోతుంది. వీటిని పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు.
  • పైగా వర్షాకాలం కాబట్టి మొక్కజొన్నలు విరివిగా దొరుకుతుంటాయి. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ సూపర్ టేస్టీగా ఉండే కార్న్ సమోసాలను ఇంటి వద్ద ఓసారి ట్రై చేయండి!

హమారా హైద్రాబాద్.. ఈ స్ట్రీట్​ ఫుడ్స్ ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.