Congress Protest For Resignation SEBI chief : అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరిపించాలని, సెబీ చీఫ్ మాధబి పురి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అలాగే ఈడీ కార్యాలయాన్ని ఘెరావ్ చేస్తామని పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
"కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జ్ లు, పీసీసీ అధ్యక్షుల సమావేశం ఈ రోజు జరిగింది. ప్రస్తుతం దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం గురించి చర్చించాం. అదానీ కుంభకోణంపై హిండెన్‌బర్గ్ ఆరోపణలపై జేపీసీ విచారణ, సెబీ చీఫ్ రాజీనామా వంటి అంశాలపై దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. అదానీ స్కామ్ లో ప్రధానమంత్రి ప్రమేయం ఉంది." అని కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
VIDEO | " we discussed on three issues - we have reiterated our demand for jpc over the adani mega scam issue. we have been demanding that for one year and the manner in which revelations have been made recently, formation of jpc becomes more important. second we discussed that a… pic.twitter.com/oe8aJDk0lW
— Press Trust of India (@PTI_News) August 13, 2024
'సెబీ- అదానీ మధ్య అనుబంధంపై దర్యాప్తు అవసరం'
సెబీ, అదానీల మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇలా చేస్తే స్టాక్ మార్కెట్లోని చిన్న పెట్టుబడిదారుల డబ్బు ప్రమాదంలో పడదని చెప్పారు. మోదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చీఫ్‌ను తప్పించాలని, అదానీ వ్యవహారంపై జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
'రాజ్యాంగంపై మోదీ సర్కార్ దాడి'
"మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రాజ్యాంగంపై నిరంతరం దాడి చేస్తోంది. కుల గణన అనేది దేశ ప్రజల డిమాండ్. పెరుగుతున్న నిరుద్యోగం, అనియంత్రిత ద్రవ్యోల్బణం వంటి ముఖ్యమైన సమస్యలపై కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది. వీటిపైన దేశవ్యాప్తంగా పోరాడుతాం. పంటకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలి. పేద, మధ్య తరగతి ప్రజలు కేంద్ర ప్రభుత్వం చేతిలో మోసపోయారు." అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు, అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై తాను విలేకరుల సమావేశం నిర్వహిస్తానని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు.
భారత్ మార్కెట్లో మరో బాంబు పేలనుందా? హిండెన్‌బర్గ్ తరువాతి టార్గెట్ ఎవరు? - Hindenburg India Tweet