Amit Shah On Congress : కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి అని, కుమారి సెల్జా వంటి పలువురు నేతలను అవమానించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వలేదని అన్నారు. తాము ఆయనను గౌరవించేందుకు పంచతీర్థాన్ని స్థాపించామని, సంవిధాన్ దివస్ ప్రకటించామని తెలిపారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తోహాణాలో సోమవారం నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న షా, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
"అభివృద్ధి తర్వాత రిజర్వేషన్లు అవసరం లేదని రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడారు. వారి (కాంగ్రెస్) అభివృద్ధి తర్వాత రిజర్వేషన్లను ఎత్తివేస్తారు. మన హరియాణా పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. మీకు రిజర్వేషన్లు కావాలా వద్దా? ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లను రక్షించగల వ్యక్తి ఎవరైనా ఉంటే అది ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే. పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే. బీజేపీ అధికారంలోకి రాకముందు లంచం తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు."
-- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
"రాహుల్ బాబా.. మీరేం మాట్లాడుతున్నారు? సిక్కు సమాజాన్ని అగౌరవపరిచిన చరిత్ర మీకు ఉంది. మీ ప్రభుత్వ హయాంలో జరిగిన దిల్లీ అల్లర్లలో వేలాది మంది సిక్కులు రోడ్లపై హత్యకు గురయ్యారు. పిల్లలు, మహిళలను కూడా విడిచిపెట్టలేదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే తలపాగా ధరించి గురుద్వారాకు వెళ్లి సిక్కు సోదరులకు క్షమాపణ చెప్పండి. అగ్నివీర్ గురించి రాహుల్ బాబా యువకులను తప్పుదారి పట్టిస్తున్నారు" అని అమిత్ షా ఆరోపించారు. హరియాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని దిల్లీ మధ్యవర్తులు ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రాన్ని మధ్యవర్తుల చేతుల్లో పెట్టాలనుకుంటున్నారా అని ప్రజలను ప్రశ్నించారు అమిత్ షా.
#WATCH | Haryana | Addressing a public rally in Tohana, Union Home Minister Amit Shah says, " about agniveer, rahul baba is misguiding the youths. i am firm in what i say, and today i am saying that none of the agniveer of haryana will be left. indian govt and haryana govt will… pic.twitter.com/PB3O0dUErQ
— ANI (@ANI) September 23, 2024
#WATCH | Haryana | Addressing a public rally in Tohana, Union Home Minister Amit Shah says, " ...rahul baba, what are you talking about - you have a history of disrespecting the sikh community. thousands of sikhs were killed on roads during your govt in delhi riots, even children… pic.twitter.com/bhz0b5CC6n
— ANI (@ANI) September 23, 2024
కాగా, 90 మంది సభ్యులు ఉన్న హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జననాయక జనతా పార్టీ (జేజేపీ)తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది.