ETV Bharat / bharat

పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - Padma Vibhushan Chiranjeevi - PADMA VIBHUSHAN CHIRANJEEVI

Chiranjeevi Padma Vibhushan : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.

Chiranjeevi Padma Vibhushan
Chiranjeevi Padma Vibhushan (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 6:47 PM IST

Updated : May 9, 2024, 7:31 PM IST

Chiranjeevi Padma Vibhushan : అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మవిభూషణ్ పురస్కారాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి తన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో కలిసి విచ్చేశారు. అందుకోసం బుధవారం సాయంత్రమే దిల్లీ చేరుకున్నారు చిరంజీవి.

భారత గణతంత్ర్య దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండో విడత కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవితో పాటు ప్రఖ్యాత నృత్యకారిణి, సీనియర్‌ నటీమణి వైజయంతిమాల బాలి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులు మీదుగా పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం.ఫాతిమా బీవీని మరణాంతరం ఈ పురస్కారంతో గౌరవించారు. హోర్ముస్జీ ఎన్‌.కామా గురువారం పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు.

ఏప్రిల్‌ 22న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు సగం మందికి పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి, మిగతా వారికి గురువారం సాయంత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగ్​దీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ ఏడాది మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించగా, వీటిలో 5 పద్మవిభూషణ్‌, 17 పద్మభూషణ్‌, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. 9 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది.

పద్మవిభూషణ్- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవి, సీనియర్‌ నటీమణి వైజయంతి మాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం, సులభ్‌ శౌచాలయ సృష్టికర్త దివంగత బిందేశ్వర్‌ పాఠక్​కు పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది కేంద్రం.

పద్మభూషణ్- దివంగత జస్టిస్‌ ఫాతిమా బీవీ, కేంద్ర మాజీమంత్రి రామ్‌నాయక్‌, మరో కేంద్ర మాజీ మంత్రి ఒ.రాజగోపాల్‌, ప్రముఖ గాయని ఉషా ఉథుప్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్‌ శర్మ, నటుడు మిథున్‌ చక్రవర్తి, కోలీవుడ్​ దివంగత నటుడు విజయ్‌కాంత్‌ సహా పలువురికి కేంద్రం పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది.

Last Updated : May 9, 2024, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.