Chhattisgarh Road Accident : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని ఏకాకిని చేసింది. ఈ ఘటనలో భార్యతో సహా 10మంది కుటుంబ సభ్యులను కోల్పోగా, ఆ వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయట పడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో తన వాళ్లను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒంటరిగా మిగిలిన ఆ బాధితుడు ఆ భయానక ఘటనను గురించి వివరిస్తూ ఆవేదనను వ్యక్తం చేశాడు. కబీర్‌ధామ్ జిల్లా బహపానీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
'అడవిలోకి వెళ్లి బీడీ ఆకులు సేకరించి మూటలతో అందరం వాహనంలో తిరిగి బయలుదేరాం. కొందరు మహిళలు, పురుషులు, చిన్నారులు కూడా అందులో ఉన్నారు. నేను డ్రైవర్ పక్కన కూర్చున్నా. ఆ సమయంలో బ్రేక్‌లు ఫెయిల్ అవడం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెనక కూర్చున్నవారిని కిందికి దూకేయమని అప్రమత్తం చేశాం. ఓ రాయి మీదకి ఎక్కించి వాహనాన్ని అదుపు చేయాలనుకున్నాం. కానీ పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది. నేను కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నా. అందరూ వాహనం నుంచి దూకే లోపే జరగాల్సిన నష్టం జరిగింది. నా భార్య సహా కుటుంబంలో 10 మందిని ఈ ప్రమాదంలో పోగొట్టుకున్నా' అని పరిస్థితిని బాధితుడు వివరించాడు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
మొత్తం 40 మందికి పైగా ప్రయాణిస్తున్న ఆ వాహనం లోయలో పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర సీఎం విష్ణుదేవ్‌సాయి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులను కవర్ధ ఎమ్మెల్యే భవనా బోహరా కలిసి పరామర్మించారు. అలాగే ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు చెందిన 20 మంది పిల్లల చదువులు, పెళ్లిళ్ల ఖర్చులను కూడా తానే భరిస్తానని చెప్పారు.
'అమేఠీ, రాయ్‌బరేలీ సీట్లు కాంగ్రెస్‌వే- ఎంత మెజారిటీ వస్తుందంటే!!' - Lok Sabha Elections 2024