Wayanad Landslide 2024 : కేరళ వయనాడ్లో జరిగిన కొండచరియలు విరిగిపడిన ప్రమాదంపై బుధవారం పార్లమెంట్ వేదికగా స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశామని కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పౌరులను సకాలంలో తరలించలేదని ఆరోపించారు. భారీ వర్షాలు కురవగానే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆ రాష్ట్రానికి పంపించామని వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, " my condolences to the bereaved families... i want to clarify something for the country... they kept on talking about early warning. i want to clarify that on july 23, the government of india gave an early warning to the… pic.twitter.com/pyi8WCFPq2
— ANI (@ANI) July 31, 2024
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, " ... under this early warning system, on july 23, at my direction, 9 ndrf teams were sent to kerala considering that there could be landslides... what did the kerala government do? were the people shifted? and if they were… pic.twitter.com/P29bTb2buk
— ANI (@ANI) July 31, 2024
"ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నింటిపైనా ఓ స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నా. 2014 తర్వాత హెచ్చరిక వ్యవస్థపై ప్రభుత్వం సుమారు రూ.2వేల కోట్లను ఖర్చు చేసింది. ఈ వ్యవస్థను 2016, 2023లో ఆధునీకరించాం. ప్రపంచంలోనే ఆధునిక హెచ్చరిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. వారం రోజుల ముందే ప్రమాదాన్ని గుర్తించే 4 దేశాల్లో భారత్ ఒకటి. కేంద్ర ప్రభుత్వం జులై 23న కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇది ప్రమాదం జరగడానికి సుమారు వారం రోజుల ముందే ఇచ్చాం. ఆ తర్వాత జులై 24, 25 తేదీల్లో మరోసారి ఇచ్చాం. జులై 26న 20 సెంటీమీటర్ల భారీ వర్షం కురవనుందని, ఫలితంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించాం. భారీగా బురదప్రవాహం వస్తుందని, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని చెప్పాం. అందుకోసమే జులై 23నే సుమారు 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు తరలించాం. కానీ కేరళ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందా? ఒకవేళ తరలిస్తే ఇంతమంది ప్రజలు ఎలా మరణించారు?"
--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
షా వ్యాఖ్యలపై స్పందించిన కేరళ సీఎం
కేరళకు ముందే హెచ్చరికలు జారీ చేశామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సీఎం పినరయి విజయన్. ఇలాంటి ఆరోపణలకు ఇది సమయం కాదని చెప్పారు. విపత్తుకు ముందు వయనాడ్కు ఎలాంటి రెడ్ అలర్ట్లు జారీ చేయలేదని తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 144 మృతదేహాలను వెలికితీశామని విజయన్ తెలిపారు. మరో 191 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. 5,592మందిని రక్షించామని, అందులో 200మందికి పైగా ఆస్పత్రిలో చేరారని వివరించారు. కాగా ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 184కు పెరిగింది.
VIDEO | Wayanad landslide: The bodies of deceased were identified and are being handed over to the relatives. #WayanadLandslide pic.twitter.com/8zyuisKBbH
— Press Trust of India (@PTI_News) July 31, 2024
మరోవైపు వయనాడ్లో కొనసాగుతున్న సహాయక చర్యలను వేగవంతం చేసింది సైన్యం. ఇప్పటివరకు సుమారు 70 మృతదేహాలను వెలికితీశామని, మరో వెయ్యి మందికిపైగా ప్రజలను రక్షించామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. సుమారు 300 ఇళ్లు ధ్వంసమయ్యాయని, అందులోని మృతదేహాలను వెలికితీశామని బ్రిగేడర్ అర్జున్ సెగన్ తెలిపారు.
VIDEO | Visuals show the devastation of landslides in #Kerala's Wayanad.
— Press Trust of India (@PTI_News) July 31, 2024
Rescue workers were looking under collapsed roofs and debris of destroyed houses for victims and possible survivors of the landslides.#WayanadLandslide #WayanadDisaster #WayanadTragedy
(Full video… pic.twitter.com/beuoOBv7WX
కేరళ విషాదంలో 174 చేరిన మృతుల సంఖ్య- ప్రమాదంలో గాయపడ్డ మంత్రి వీణా జార్జ్ - Wayanad Landslides
వయనాడ్ విపత్తు నుంచి కుటుంబాన్ని కాపాడిన 'ఆవు'- లేకుంటే అంతా మట్టిలోనే! - Wayanad landslides