ETV Bharat / bharat

కుప్పకూలిన దేశంలోనే అతిపెద్ద వంతెన- ఒకరు మృతి- 9మందికి గాయాలు - Bridge Collapsed In Bihar - BRIDGE COLLAPSED IN BIHAR

Bridge Collapsed In Bihar : బిహార్​లో నిర్మాణంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వంతెన కుప్పకూలింది. పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో మూడు గర్డర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Bridge Collapsed In Bihar
Bridge Collapsed In Bihar
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 9:35 AM IST

Updated : Mar 22, 2024, 12:21 PM IST

Bridge Collapsed In Bihar : బిహార్​లోని సుపాల్​ జిల్లాలో నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద వంతెన కుప్పకూలింది. నిర్మాణంలో ఉండగా మూడు పిల్లర్ల గర్డర్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో 153, 154 మధ్య బ్రిడ్జి కూలిపోయింది. దీంతో దాదాపు 10 మంది కూలీలు శిథిలాల కింది చిక్కుకుపోయినట్లు ఎన్​హెచ్​ఏఐ అధికారులు తెలిపారు. అందులో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు చెప్పారు. మిగతా 9మంది గాయాలతో బయటపడ్డారని తెలిపారు. బాధితులకు పరిహారం అందేలా చూస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఎన్​హెచ్​ఏఐ అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్ సహా సీనియర్​ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి, విజయ్ కుమార్ సిన్హా స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని, సంబంధిత సంస్థ ద్వారా మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందుతుందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎన్​హెచ్​ఏఐ, జిల్లా యంత్రాంగంతో తాను టచ్​లో ఉన్నట్లు తెలిపారు.

భారత్​ మాల ప్రాజెక్టులో భాగంగా బిహార్​ మధుబని జిల్లాలోని భేజా, సుపాల్ జిల్లాలోని బకూర్​ మధ్య దాదాపు రూ.1200 కోట్ల వ్యయంతో​ వంతెనను నిర్మిస్తున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) నిర్మిస్తున్న ఈ 10.2 కిలో మీటర్లు పొడవు ఉండే వంతెన పూర్తయితే దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జిగా అవతరిస్తుంది. ఇది అసోంలోని భూపేన్ హజారికా వంతెన కంటే కిలోమీటర్ పొడవు ఉంటుంది. మొత్తం 171 పిల్లర్లతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు.

అంతకుముందు కూలిన వంతెనలు
బిహార్‌లో బ్రిడ్జిలు కూలిపోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కొన్ని వంతెనలు ఇలాగే కూలిపోయాయి. గతేడాది ఖగారియా జిల్లాలోని భాగల్‌పుర్‌లో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తాంగంజ్ వంతెన ఒక్కసారిగా నదలో కుప్పకూలింది. సుమారు వంద మీటర్ల మేర వంతెన కూలి నీటిలో పడిపోయింది. అయితే నిర్మాణంలో ఉన్న ఈ బ్రిడ్జి రెండు సార్లు కూలిపోయింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

భూటాన్​కు​ ప్రధాని మోదీ- కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి - PM Modi Bhutan Visit

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్- 'జైలు నుంచే పరిపాలన' - Kejriwal Arrested

Last Updated : Mar 22, 2024, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.