Boys Special Pooja For Marriage In Chikkamagaluru : సాధారణంగా మంచి భర్త రావాలని అమ్మాయిలు పూజలు, వ్రతాలు, నోములు చేయడం చూస్తూ ఉంటాం. కానీ, ఆ ఊరిలో మాత్రం వీలైనంత త్వరగా తమకు ఓ జోడీ దొరకాలని కోరుతూ కొందరు యువకులు ఓ దేవుడి గుడిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో భాగంగా 30 మందితో కూడిన బ్రహ్మచారుల జాబితాను ఆ దేవుడి హుండీలో వేశారు. ఈ అరుదైన సంఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో జరిగింది.
దేవుడికి లెటర్!
జిల్లాలోని బ్యాడిగెరె గ్రామంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఏటా సుగి జాత్రా పేరుతో మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన 25 నుంచి 38 ఏళ్ల వయసున్న సుమారు 30 మంది పెళ్లి కాని యువకులు ఇంత వయసు వచ్చినా తమకు వివాహం కావడం లేదంటూ గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ అజ్జయ్య స్వామి, శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవీకి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. తమ అందరి పేర్లను కాగితాలపై రాసి ఒకదానిని కనికె దేవుడి హుండీలో వేయగా, మరో జాబితాను పరదేశప్ప మఠానికి పంపించారు. ఇలా చేస్తే ఆ దేవుడు తమ కోరికలను చదివి త్వరగా వాటిని నెరవేరుస్తాడని ఇక్కడి అబ్బాయిల విశ్వాసం.

"సుగి జాత్రా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకించి నాలుగో రోజు ముఖ్యంగా పెళ్లి కాని యువకులు తమకు త్వరగా వివాహం జరిపించాలని కోరుతూ ఆ దేవుడికి మొక్కులు అప్పజెప్పుతారు. ఇందులో భాగంగానే ఈసారి 30 మంది అవివాహిత యువకులం శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాం. మా పేర్లతో కూడిన జాబితాను ఆ దేవుడికి సమర్పించాం. ఇలా చేస్తే మాకు త్వరగా పెళ్లి జరుగుతుందని నమ్ముతాం."
- బీఎస్. అనిల్, పెళ్లికాని యువకుడు


పెళ్లికాని ప్రసాదు ప్రేమ ఎన్నికలు!
Politician Marriage Proposal : పట్టుదలతో ఉన్న రాజకీయ నాయకుడు ప్రతీ ఎన్నికల్లో నామినేషన్ వేసినట్టు- వయసు ముదిరిన నేనూ పెళ్లి కోసం ఎన్నో ఏళ్లుగా నామినేషన్ వేస్తూనే ఉన్నాను. పోటీ చేసే అభ్యర్థిలా అఫిడవిట్లో అన్ని వివరాలూ సమర్పించినట్టే- ఆపసోపాలతో నా అర్హతలన్నీ అచ్చేసి పెళ్లి కూతురు వేట మొదలు పెట్టాను. ఎలాగైనా పదవి దక్కించుకోవడం కోసం నాయకులు పదేపదే పార్టీలు మార్చినట్టు- పెళ్లి కుదరాలని నేనూ రకరకాల ప్రయత్నాలు చేశాను. పంతులుగారితో మొదలెట్టిన నా కలల రాణి వెదుకులాట మ్యాట్రిమొనీల్లో గాలించేదాకా వచ్చింది. ఈ వింత కథనం ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు 'కర్మ' ఫలితమే! : అన్నా హజారే - Anna Hazare On Kejriwal Arrest