ETV Bharat / bharat

ఆ ఊరిలో 520 ఇళ్లు- ఇంటికికొక రక్తదాత పక్కా- ఎక్కడో తెలుసా? - Blood Donors Village - BLOOD DONORS VILLAGE

Blood Donors Village : ఆ గ్రామంలో ఇంటికొక రక్తదాత కచ్చితంగా ఉంటారు. ఎప్పటికప్పుడు రక్తాదనం చేస్తూనే ఉంటారు. ఏటా జరిగే బ్లడ్​ డొనేషన్​ క్యాంప్​లో పాల్గొంటారు. అసలు ఆ గ్రామం ఎక్కడుంది? ఏటా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి కారణమేంటి? వంటి విషయాలు తెలుసుకుందాం రండి.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 4:45 PM IST

Updated : Apr 21, 2024, 6:45 PM IST

ఆ ఊరిలో 520 ఇళ్లు- ఇంటికికొక రక్తదాత పక్కా- ఎక్కడో తెలుసా?

అదేంటి గ్రామంలో ఎక్కడ చూసినా రక్తదానంపై అవగాహన కల్పించేలా బోర్డులు కనిపిస్తున్నాయని అనుకుంటున్నారా? బస్టాండ్ కూడా రక్తదాన ప్రాముఖ్యాన్ని తెలిపేలా ఉండడం వల్ల ఆశ్చర్యపోతున్నారా? వీటి వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Blood Donors Village : కర్ణాటక హావేరి జిల్లాలోని జల్లాపుర్ గ్రామంలో 520కుపైగా ఇళ్లు ఉన్నాయి. ప్రతీ ఇంటిలో ఒక రక్తదాత కచ్చితంగా ఉంటారు. అందులో చాలా మంది 10 సార్లు కన్నా ఎక్కువగా రక్తదానం చేశారు. రక్తంతోపాటు ప్లాస్మా, ప్లేట్​లెట్స్​ను కూడా దానం చేస్తున్నారు. హవేరి జిల్లా ఆస్పత్రిలో అత్యధిక సార్లు రక్తదానం చేసిన దాతలు ఉన్న గ్రామంగా జల్లాపుర్ నిలిచింది.

BLOOD DONORS VILLAGE
గ్రామంలో రక్తదానంపై అవగాహన కలిగేలా బోర్డు

అప్పుడే నిర్ణయం!
కరోనా మహమ్మారి సమయంలో గర్భిణీలు సహా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు సకాలంలో రక్తం అందక మరణించారు. ఆ విషయాన్ని గుర్తించిన జల్లాపుర్​ గ్రామస్థులు అప్పటి నుంచి రక్తదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 'జీవదాని బళగ' పేరుతో గ్రూపుగా ఏర్పడి ఏటా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. రక్తదాన ప్రాముఖ్యాన్ని గ్రామస్థులకు వివరిస్తున్నారు.

Blood Donors Village
బస్టాండ్

"ప్రసవ సమయంలో రక్తం లేకపోవడం వల్ల చాలా మంది గర్భిణీలు మరణించారని తెలుసుకున్నాం. అప్పుడే ఊరి ప్రజలంతా రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నాం. 2020లో మొదటి రక్తదాన శిబిరాన్ని నిర్వహించాం. కరోనా కారణంగా సామాజిక దూరం పాటిస్తూనే 100 యూనిట్ల రక్తాన్ని జాగ్రత్తగా సేకరించి జిల్లా ఆస్పత్రికి పంపించాం. అప్పటి నుంచి మేం రక్తదానంతో పాటు అవయవ దానం చేయాలని కూడా నిర్ణయించుకున్నాం"

-- సతీశ్, గ్రామ యువకుడు

ఎక్కడ చూసినా ఆ బోర్డులే!
గ్రామంలో ముఖ్యమైన కూడళ్లలో రక్తదానంపై అవగాహన కలిగేలా బోర్డులు ఏర్పాట్లు చేశారు 'జీవదాని బళగ' సభ్యులు. రక్తదానం ఎందుకు చేయాలి? ఎవరు చేయాలి? ఎన్ని సార్లు చేయవచ్చు? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? వంటి వివరాలను పొందుపరిచారు. బస్టాండ్ గోడలపై అవే వివరాలను పెయింట్స్ ద్వారా రాయించారు.

BLOOD DONORS VILLAGE
జీవదాని బళగ గ్రూప్ సభ్యులు

ఇక బంగాల్​లోని కోల్​కతాలో ఓ కానిస్టేబుల్ రక్తం అవసరమైన వారికి అండగా నిలుస్తున్నారు. రక్తదానం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని ఏడువేల మంది రక్తదాతల వివరాలను సేకరించారు. తన వద్ద ఉన్న రెండు స్మార్ట్ ఫోన్లలో వాటిని పొందుపర్చారు. రక్తం అవసరమైన వారికి తన వద్ద ఉన్న వివరాలు అందిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

'ప్రాణం' కోసం పాదయాత్ర- రక్తదానంపై ప్రచారం చేస్తూ 17వేల కి.మీ నడక

వరుడి వినూత్న నిర్ణయం- పెళ్లిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్- 70 మంది రక్తదానం

Last Updated : Apr 21, 2024, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.