ETV Bharat / bharat

బిహార్​లో NDA ప్రభుత్వం- ముఖ్యమంత్రిగా నీతీశ్​- డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు బీజేపీ నేతలు

Bihar Political Crisis : బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. నీతీశ్​ రాజీనామాను గవర్నర్​ ఆమోదించారు.

Bihar Political Crisis
Bihar Political Crisis
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 9:48 AM IST

Updated : Jan 28, 2024, 2:21 PM IST

1:45 PM

బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు
బిహార్​లో నాటకీయ పరిణామాల మధ్య ఎన్​డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ముఖ్యమంత్రిగా నీతీశ్​ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ నుంచి ఇద్దర నేతలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు నీతీశ్​ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీ, హెచ్​ఏఎమ్​, ఒక స్వంతంత్ర్య అభ్యర్థి గవర్నర్​ రాజేంద్ర ఆర్లేకర్​ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారు.

అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి, మరో బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాను లెజిస్లేటివ్​ పార్టీ నేత, డిప్యూటీ నేతగా ఎన్నుకున్నారు. దీంతో వీరిద్దరే ఉపముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇతర నేతలు నితిన్​ నబిన్, శంష్నావాజ్​ హుస్సేన్, రామ్​ప్రీత్ పాసవాన్​‌, నీరజ్​ సింగ్ బబ్లూను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

12:45 PM

నీతీశ్​ కుమార్ ఒక ఊసరవెల్లి : కాంగ్రెస్
ఎన్​డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు బీజేపీ, జేడీయూ సహా ఇతర మిత్ర పక్షాల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్​ చౌదరిని లెజిస్లేటివ్​ పార్టీ నేతగా, విజయ్​ సిన్హౌను డిప్యూటీ లెజిస్లేటివ్​ పార్టీ నేతగా ఎన్నికున్నారు.

మరోవైపు, నీతీశ్​ కుమార్ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ స్పందించింది. నీతీశ్​ను​ ఊసరవెల్లితో పోల్చింది. ఆయన చేసిన ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని నీతీశ్​ చేసిన పనిని తప్పుబట్టింది. రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో న్యాయ్​ యాత్రకు ప్రధాని మోదీ, బీజేపీ భయపడ్డాయని, అందుకే ఆ యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి ఈ నాటకానికి తెరలేపాయని కాంగ్రెస్ అరోపించింది.

ఇలాంటి మనుషులు దేశంలో చాలా మంది ఉన్నారు : ఖర్గే
దీనిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఇలా జరగబోతోందని బిహార్ ఉపముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ ఇదివరకే హింట్ ఇచ్చారని చెప్పారు. అదే ఈరోజు నిజమైందని అన్నారు. ఇలాంటి వ్యక్తులు దేశంలో చాలా మంది ఉంటారని ఎద్దేవా చేశారు.

11:40 AM
'మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవు'

  • రాజీనామా తర్వాత మీడియాతో మాట్లాడిన నీతీశ్​ కుమార్
  • సీఎం పదవికి రాజీనామా చేశాను: నీతీశ్‌కుమార్‌
  • ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌ను కోరా: నీతీశ్‌కుమార్‌
  • అన్ని వర్గాల సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం: నీతీశ్‌కుమార్‌
  • మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవు: నీతీశ్‌కుమార్‌
  • నేతల వైఖరి సరిగా లేనందున చాలామంది ఇబ్బంది పడ్డారు: నీతీశ్‌
  • మహాకూటమితో సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించాం: నీతీశ్‌కుమార్

11:26 AM
సీఎం పదవికి నీతీశ్​ కుమార్ రాజీనామా
బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. మహాకూటమితో సంబంధాలు తెంచుకున్నట్లు తెలిపి బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమైన్నట్లు పేర్కొన్నారు. నీతీశ్​ రాజీనామా గవర్నర్​ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రిగా నీతీశ్​ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బీజేపీ, జేడీయూ సమావేశాలు
అంతకుముందు, నీతీశ్ కుమార్ నివాసంలో జేడీయూ శాసనసభ పక్ష సమావేశాశం జరిగింది. ఈ భేటీకి జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన అనంతరం నీతీశ్​ కుమార్ గవర్నర్​ను కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై పట్నాలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

  • Nitish Kumar tendered his resignation as the Chief Minister of Bihar to Governor Rajendra Arlekar. The Governor accepted the resignation and deputed him as the Acting CM. pic.twitter.com/uaDXROe6PA

    — ANI (@ANI) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాహుల్‌ గాంధీ ఆత్మపరిశీలన చేసుకోవాలి
జేడీయూ నేత నీరజ్‌ కుమార్‌, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో భాగంగా ఆయన ఎక్కడకు వెళ్లినా అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పారు. వ్యూహాల వైఫల్యంపై రాహుల్ గాంధీ సమీక్షించుకోవాలని సూచించారు. మిత్రపక్షాలు ఎందుకు దూరమవుతున్నాయో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు.

Last Updated : Jan 28, 2024, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.