ETV Bharat / bharat

రంజాన్ స్పెషల్స్ : "షీర్ ఖుర్మా" నుంచి "బాబా గణౌష్" దాకా! - అద్దిరిపోయే వీగన్ వంటకాలు! - Eid Special Vegan Dishes - EID SPECIAL VEGAN DISHES

Ramadan Best Vegan Dishes : రంజాన్ రోజు ముస్లింలు తమ సంప్రదాయమైన వంటలతోపాటు మాంసాహార రెసిపీలను ప్రిపేర్ చేసుకుంటారు. మరి, శాకాహారుల సంగతేంటి? అన్నప్పుడు.. మాంసాహారానికి ఏ మాత్రం తగ్గని పోషకాలతో.. అద్భుతమైన వీగన్ రెసిపీస్ తీసుకొచ్చాం. ఈద్​ విందులో వీటిని చేర్చుకున్నారంటే.. జిందగీ ఖుష్ అనాల్సిందే.

Best Vegan Dishes
Ramadan
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 9:29 AM IST

Best Vegan Dishes to Celebrate Ramadan : ప్రపంచవ్యాప్తంగా నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు(రోజా) చేపట్టిన ముస్లిం సోదరులు.. నేటి ఈద్​-ఉల్​-ఫితర్(రంజాన్)​ తో ముగింపు పలకనున్నారు. ఈ క్రమంలో రంజాన్​ విందును ముస్లిం సోదరులు ఎక్కువగా మాంసాహారం వంటలతో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే.. పర్యావరణం, ఆరోగ్యం వంటి కారణాల వల్ల చాలా మంది శాకాహారానికి మారుతున్నారు. ఇలాంటి వారు.. ఈద్ విందులో మాంసాహారానికి ఏ మాత్రం తగ్గని వీగన్ ఫుడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వీగన్ షీర్ ఖుర్మా : రంజాన్ రోజూ ప్రతీ ముస్లిం తప్పనిసరిగా టేస్ట్ చేసే రెసిపీ షీర్ ఖుర్మా. ఈ వంటకానికి అద్భుతమైన రుచిని అందించడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే.. వీగన్ డైట్ పాటించేవారు పాలు, నెయ్యి వంటి వాటికి దూరంగా ఉంటారు. కాబట్టి, మీరు పాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్​లో దొరికే కొన్ని రకాల హోస్ట్​తో(ఓట్, బాదం, సోయా పాలు) ఈ ప్రత్యేకమైన డెజర్ట్​ను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే.. బాదం, జీడిపప్పు, ఓట్స్​ను యాడ్ చేసుకుంటే అద్భుతమైన పోషకాలు లభించడమే కాకుండా వీగన్ షీర్ ఖుర్మా అదిరిపోయే టేస్ట్​ను అందిస్తుంది!

బాబా గణౌష్(Baba Ganoush) : ఈద్​ సాంప్రదాయ విందులో వీగన్స్ కోసం మరో అద్భుతమైన వంటకం.. బాబా గణౌష్. మధ్యప్రాచ్యానికి చెందిన ఈ శాకాహార ప్రసిద్ధ వంటకంలో పోషకాలు మెండుగా ఉండి రుచికరంగా ఉంటుంది. ఈ వీగన్ స్పెషల్ రెసిపీని వంకాయలు, వెల్లుల్లి, ఆలివ్ నూనె, నిమ్మరసం, బీన్స్​తో ప్రిపేర్ చేసుకుంటారు.

టబ్బులేహ్(Tabbouleh) : ఈ రుచికరమైన సలాడ్.. రంజాన్ రోజు శాకాహారం తినే ముస్లింలకు గొప్ప ఛాయిస్​గా​ చెప్పుకోవచ్చు. దీన్ని బుల్గుర్ గోధుమలు, సన్నగా తరిగిన పార్స్లీ, టమాటాలు, ఉల్లిపాయలు, నిమ్మరసం, పుదీనా, మసాలాలతో ప్రిపేర్ చేసుకుంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో నిండి ఉంటాయి.

అనార్కలీ టు షరారా - రంజాన్ పండుగకు మీరు ఈ లుక్స్​ ట్రై చేసి చూడండి! - EID Special Ethnic Wear

మష్​రూమ్ గలౌటీ : మీరు రంజాన్ రోజు మంచి పోషకాలు కలిగిన బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలంటే.. మష్​రూమ్ గలౌటీ కబాబ్​లని బెస్ట్ ఛాయిస్​గా చెప్పుకోవచ్చు. మొక్కల ఆధారిత పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు, మెత్తగా తరిగిన పుట్టగొడుగులతో ప్రిపేర్ చేసుకునే ఈ రుచికరమైన వంటకం ఈద్​ రోజు తింటే అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు. అంతేకాదు.. ఇవి తినడం ద్వారా శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, పోషకాలు లభిస్తాయి.

బీట్‌రూట్ సీక్ కబాబ్ : ఈద్​ సాంప్రదాయ విందులో వీగన్స్​కు అధిక మొత్తంలో పోషకాలు అందించే మరో అద్భుతమైన రెసిపీ.. బీట్​రూట్ సీక్ కబాబ్. శాకాహారులు రంజాన్​ రోజు దీనిని వారి విందులో చేర్చుకున్నారంటే ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు. తురిమిన బీట్‌రూట్, మసాలా దినుసుల మిశ్రమంతో చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉండడమే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది.

హైదరాబాదీ బగారా బైంగన్ : రంజాన్ రోజు వీగన్స్ తమ విందులో హైదరాబాదీ బగారా బైంగన్ రెసిపీని చేర్చుకోవడం ద్వారా బోలెడు పోషకాలు పొందవచ్చు. లేత వంకాయలు, సుగంధ ద్రవ్యాలు, చింతపండు, ఉడికించిన వేరుశనగలు, మరికొన్ని పదార్థాలతో ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ ఈద్​ రోజు శాకాహారులకు మంచి అనుభూతిని మిగులుస్తుందంటే నమ్మాల్సిందే.

రంజాన్ స్పెషల్ "రైస్ ఖీర్ పుడ్డింగ్" - ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా! - Rice Kheer Pudding Recipe

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.