ETV Bharat / bharat

డాక్టర్ల డిమాండ్లకు తలొగ్గిన 'దీదీ' సర్కార్! ముగ్గురు RG కర్​ ఆస్పత్రి ఉన్నతాధికారులపై వేటు - Kolkata Doctor Case

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 8:45 AM IST

Updated : Aug 22, 2024, 10:12 AM IST

Bengal Health Department Removes 3 Officials : బంగాల్ వైద్య విద్యార్థి అత్యాచార ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల డిమాండ్లకు తలొగ్గిన బంగాల్ ప్రభుత్వం, ఆర్‌జీ కర్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారులను బుధవారం బదిలీ చేస్తు ఉత్తర్వులను వెలువరించింది. మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ను పదవి నుంచి తొలగించింది.

Bengal Health Department Removes 3 Officials
Bengal Health Department Removes 3 Officials (ETV Bharat)

Bengal Health Department Removes 3 Officials : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనలో వెల్లువెత్తిన నిరసనలకు బంగాల్‌ ప్రభుత్వం తలొగ్గింది. ఆర్​జీ కర్‌ ఆసుపత్రిలోని ముగ్గురు సీనియర్‌ అధికారులను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు బంగాల్‌ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని, వివిధ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. దీంతోపాటు జూనియర్‌ వైద్యురాలి మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, బదిలీ అయిన ఆర్​జీ కర్‌ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు నిగమ్‌ ప్రకటించారు.

"వైద్యురాలి హత్యాచార ఘటనపై గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్ల మేరకు పలు చర్యలు చేపట్టాం. ప్రస్తుత పరిస్థితి సాధారణ స్థితికి రావాలని కోరుతున్నాం. డాక్టర్లు వైద్యసేవలు కొనసాగించాలని కోరుతున్నాం. డాక్టర్ల డిమాండ్ల మేరకు ఆస్పత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశాం" అని ఎన్‌ఎస్ నిగమ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్ నియామకాన్ని బంగాల్ ఆరోగ్య శాఖ రద్దు చేసింది. ఆర్​జీ కర్ ప్రస్తుత ప్రిన్సిపల్ సుహ్రితా పాల్‌ను, బరాసత్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్​గా బదిలీ చేసింది. ఆమె స్థానంలో మానస్ కుమార్ బంధోపాధ్యాయ నియమించింది. ఆర్​జీ కర్ ఆసుపత్రి వైస్ ప్రిన్సిపాల్, మెడికల్ సూపరింటెండెంట్ బుల్బుల్ ముఖోపాధ్యాయ స్థానంలో సప్తర్షి ఛటర్జీని నియమిస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆర్‌జీకేఎంసీహెచ్ ఔషధ విభాగాధిపతి అరుణాభ దత్తా చౌధురిని, మాల్దా మెడికల్ కాలేజీకి బదిలీ చేసింది.

కొవ్వొత్తితో సౌరభ్​ గంగులీ నిరసన
వైద్యురాలి అత్యాచారాలను వ్యతిరేకిస్తూ బుధవారం సాయంత్రం క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్​ గంగులీ కొవ్వొత్తితో నిరసన తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన భార్య డోనా, కుమార్తె సనాచో కలిసి పాల్గొన్నారు. నల్ల దుస్తులు ధరించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గంగులీ భార్య డోనా మాట్లాడారు. ఈ నిరసనలో ప్రతి ఒక్కరు భాగం కావాలని కోరుకుంటారు. ఈ రోజు వారు స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. ఆరోగ్యకర వాతావరణం ఉండే సమాజాన్ని చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరు సమానమే, అందరికీ భద్రత కల్పించాలి. కేవలం డాక్టర్లకే కాదు, సమాజంలో అన్నివర్గాల మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

వైద్యురాలిపై దాడికి ముందు - రెడ్‌లైట్‌ ఏరియాకు వెళ్లిన నిందితుడు! - Kolkata Doctor Rape Case Updates

అనాథ శవాలనూ వదలని ఆర్​జీ కర్ మాజీ ప్రిన్సిపల్‌ - సిట్ విచారణలో సంచలన విషయాలు! - kolkata doctor case

Last Updated : Aug 22, 2024, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.