Coconut Oil Home Cleaning Hacks : కొబ్బరితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. కొబ్బరే కాదు దాని నుంచి తయారుచేసే సహజమైన నూనెతో కూడా బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొబ్బరినూనెను ఎక్కువగా జుట్టు సంరక్షణ కోసం వాడుతుంటారు. అలాగే చర్మ సంరక్షణకూ ఈ నూనెను యూజ్ చేస్తుంటారు. అంతేకాదు.. కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి నూనెను వంటకాలలో కూడా వాడుతుంటారు. అయితే, ఇవి మాత్రమే కాదు.. కోకోనట్ ఆయిల్(Coconut Oil)ను మరెన్నో రకాల ఇంటిపనులకూ ఉపయోగించొచ్చని మీకు తెలుసా? లేదు అంటే.. మాత్రం ఈ స్టోరీ చదవాల్సిందే.
క్రేయాన్ మరకలు ఇట్టే పోతాయి : ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారు క్రేయాన్స్‌తో ఫర్నీచర్‌పై గీతలు గీయడం, బొమ్మలేయడం చేస్తుంటారు. అలాంటి టైమ్‌లో కొబ్బరినూనె వాడితే ఈజీగా ఫర్నీచర్‌పై మరకలు తొలగించుకోవచ్చంటున్నారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. మరకలు పడ్డ చోట వాటిపై కొద్దిగా కొబ్బరినూనెను రాయండి. ఆపై కాస్త వంటసోడా చల్లి బ్రష్‌తో రుద్దుకుంటే చాలు. ఈజీగా మరకలు పోతాయని చెబుతున్నారు.
షూస్ మెరిపించుకోవచ్చు : చాలా మంది ఈ రోజుల్లో ఆఫీసులు, ఉద్యోగాలు, ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కువగా షూస్ వాడుతున్నారు. అందులో కొంతమంది లెదర్ బూట్లు వాడుతుంటారు. అయితే, అవి కొత్తలో ఉన్నప్పుడు బాగానే కనిపిస్తాయి. కొన్ని రోజులకు పాతవాటిలా మారుతుంటాయి. అలాంటి టైమ్‌లో కొబ్బరినూనెతో పాలిష్ చేస్తే చాలు.. అవి కొత్తవాటిలా మెరిసిపోతాయంటున్నారు నిపుణులు. అలాగే లెదర్ బ్యాగులనూ కొబ్బరినూనెతో పాలిష్ చేసుకోవడం ద్వారా కొత్త వాటిలా మెరిపించుకోవచ్చని చెబుతున్నారు.
చూయింగ్‌గమ్ రిమూవర్‌గా పనిచేస్తుంది : పిల్లలు చూయింగ్‌గమ్ తిన్నప్పుడు కొన్నిసార్లు ఫ్లోర్‌కో, గోడకో.. అతికిస్తుంటారు. అలాంటి టైమ్‌లో చూయింగ్‌గమ్ అతికించిన చోట కాస్త కొబ్బరినూనె రాసి కాసేపాగి తీస్తే సులువుగా వచ్చేస్తుందంటున్నారు నిపుణులు.
చాపింగ్ బోర్డు క్లీనింగ్ కోసం : కూరగాయలు కట్ చేసుకోవడానికి చాలా మంది చాపింగ్ బోర్డును ఉపయోగిస్తుంటారు. దాన్ని శుభ్రం చేయడానికీ కొబ్బరినూనె చక్కగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ నూనెతో శుభ్రం చేసుకోవడం ద్వారా బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి దరిచేరవని సూచిస్తున్నారు.
- ఇవేకాకుండా కొబ్బరినూనెతో మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. వర్షాకాలం, శీతాకాలాల్లో తాళాలు, సొరుగులు, కత్తెర వంటివి కాస్త మొరాయిస్తాయి. ఆ టైమ్‌లో రెండు చుక్కల కొబ్బరినూనె వేయండి. మీ సమస్య ఈజీగా తొలగిపోతుందంటున్నారు నిపుణులు.
- అదేవిధంగా కర్టెన్ రాడ్‌లు తుప్పు పడుతుంటాయి. అలా తుప్పు పట్టకుండా ఉండాలంటే.. నెలకోసారైనా దూదిని కొబ్బరినూనెలో ముంచి తుడుచుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
ఇవీ చదవండి :
ఫర్నిచర్‌పై మరకలు పోవాలా? ఈ టిప్స్ పాటిస్తూ క్లీన్ చేస్తే సూపర్ షైన్ గ్యారెంటీ!
గోడలపై పిల్లలు గీసిన గీతలు తొలగిపోవట్లేదా? - ఇలా చేస్తే ఒక్క నిమిషంలో క్లీన్ అవుతాయి!