ETV Bharat / bharat

అరటి ఆకులకు 'కిరాక్' డిమాండ్​- ఒక్కోటి రూ.13- అధిక ధరలతో హోటళ్లు పరేషాన్ - Banana Leaves Demand In Bengaluru

Banana Leaves Demand In Bengaluru : గత కొద్దిరోజులుగా నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బెంగళూరును మరో సమస్య వేధిస్తోంది. భోజనానికి వినియోగించే అరటి ఆకు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. దీంతో హోటల్​ యజమానులు, వినియోగదారులు ధరల భారాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

Banana Leaves Demand In Karnataka Bengaluru

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 12:55 PM IST

Banana Leaves Demand In Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో గత కొద్దిరోజులుగా నీటి సంక్షోభం నెలకొంది. సరిపడా నీరు లేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు బెంగళూరులో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే తాగునీటి సమస్యతో బాధపడుతున్న నగరవాసులకు మరో కష్టం వచ్చింది. భోజనానికి వినియోగించే అరటి ఆకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని చోట్ల సరఫరా తగ్గి అరటి ఆకుల కొరత కూడా ఏర్పడింది.

తగ్గిన స్టీల్​ ప్లేట్ల్ వాడకం
బెంగళూరులోని పలు ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా కొన్ని హోటళ్లు స్టీలు ప్లేట్లకు బదులుగా అరటి ఆకులను వినియోగిస్తున్నాయి. అయితే స్టీల్ ప్లేట్ల వినియోగం తగ్గి, అరటి ఆకు వాడకం పెరిగింది. దీంతో హోటల్ వ్యాపారులు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

Bengaluru : Lack Of Water, Increased Demand For Banana Leaves
బెంగళూరులో అరటి ఆకులకు భారీ డిమాండ్​.

నీటి కొరతతో ఆకులకు డిమాండ్
నగరంలో నీటి సమస్య తలెత్తడం వల్ల నీటి ట్యాంకర్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు ప్రజలు నీటి వినియోగాన్ని తగ్గించుకునేందుకు డిస్పోజబుల్​ ప్లేట్లు, గ్లాస్​లను వాడుతున్నారు. సంప్రదాయ పద్ధతిలో భోజనం, టిఫిన్​ చేయాలనుకున్నవారు అరటి ఆకులను వాడుతున్నారు. దీంతో ఒక్కసారిగా బెంగళూరులో అరటి ఆకులకు డిమాండ్​ పెరిగింది. అదే సమయంలో అరటి ఆకుల సరఫరా సైతం తగ్గింది. దీంతో అరటి ఆకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి
బెంగళూరులోని మల్లేశ్వరం, కేఆర్​ మార్కెట్​, చామరాజ్‌పేట మార్కెట్లలో అరటి ఆకులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. అరటి ఆకులు, డిస్పోజబుల్​ ప్లేట్ల అమ్మకాలు 40శాతానికి పైగా పెరిగాయి. కర్ణాటకలోని చామరాజనగర్​, మైసూరు, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​లోని హిందూపురం, కడప నుంచి అరటి ఆకులను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు.

మొన్నటిదాకా రూ.3- ఇప్పుడు రూ.13
కొన్నాళ్ల క్రితం వరకు చిన్న అరటి ఆకు ధర రూ.3 నుంచి రూ.6, పెద్ద ఆకు అయితే రూ.8 నుంచి రూ.10 వరకు ఉండేదని మల్లేశ్వరానికి చెందిన వ్యాపారి సునీల్​ చెబుతున్నారు. ఆకుల సైజును బట్టి ధర ఉండేదని అన్నారు. కానీ ప్రస్తుతం బెంగళూరులో నీటి ఎద్దడి నెలకొనడం వల్ల ఒక్క ఆకు రూ.9 నుంచి రూ.13 పలుకుతుందని అంటున్నారు. ఆరు ఆకుల సెట్​ను రూ.70కు విక్రయిస్తున్నట్లు చెప్పారు.

ఎన్నికల బరిలో ఇందిరా గాంధీ హంతకుడి కొడుకు- పోటీ ఇక్కడి నుంచే! - SARABJIT SINGH KHALSA LS Polls 2024

పెరుగుతున్న ఎండలు- అధికారులతో ప్రధాని మోదీ హైలెవెల్ మీటింగ్- సమన్వయంతో పనిచేయాలని ఆదేశం - PM Modi On Heat wave Conditions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.