ETV Bharat / bharat

6నెలల తర్వాత బద్రీనాథుడి ఆలయం ఓపెన్​- వర్షాన్ని లెక్కచేయకుండా పోటెత్తిన భక్తులు - Char Dham Yatra 2024 - CHAR DHAM YATRA 2024

Badrinath Opening Date 2024 : ఉత్తరాఖండ్​లోని ప్రసిద్ధ బద్రీనాథుడి ఆలయా తలుపు తెరుచుకున్నాయి. శీతాకాలం సందర్భంగా మూసివేసిన ఆలయాన్ని ఆరు నెలల తర్వాత తెరిచారు. చార్​ధామ్​ యాత్రలో భాగంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Badrinath Opening Date 2024
Badrinath Opening Date 2024 (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 11:30 AM IST

Updated : May 12, 2024, 4:34 PM IST

Badrinath Opening Date 2024 : ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చరణ, డప్పు, నాదస్వర వాయిద్వాల మధ్య బద్రీనాథ్‌ ఆలయ తలుపులను పూజారులు తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఆలయ తలుపులు తెరవడం వల్ల చార్‌ధామ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. చార్‌ధామ్ యాత్రలో బద్రీనాథ్‌, కేదార్ నాథ్‌, యుమునోత్రి, గంగోత్రి ఆలయాలను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోగానే ఆలయంలో లోపలికి భక్తులు పోటెత్తారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భారీగా భక్తులు తరలి వచ్చారు. కేదార్​నాథ్‌, యుమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులను అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారమే తెరిచారు.

భక్తుల నినాదాలతో తలుపులు ఓపెన్
ఉదయం నాలుగు గంటల నుంచే ఆలయ తలుపు తెరిచే కార్యక్రమం ప్రారంభమైంది. రెండు గంటల పూజల అనంతరం ఆలయ కమిటీ అధికారులు, పాలకమండలి కలిసి భక్తుల సమక్షంలో ఉదయం 6 గంటలకు తలుపులు తెరిచారు. ఆలయానికి వచ్చిన భక్తులు బద్రీ విశాల్​ లాల్​ కీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించారు. మరోవైపు ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్ బద్రీనాథుడి దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చారు.

సీఎం శుభాకాంక్షలు
ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్​సింగ్ ధామి ప్రజలకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ తలుపు తెరుచుకున్నాయని, చార్​ ధామ్​ యాత్రలో భాగంగా వస్తున్న భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం అని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నదే మా ప్రయత్నమని అన్నారు. ప్రారంభ రోజుల్లో ఎక్కువమంది వస్తుంటారని, అందుకే భక్తులు తమ బుకింగ్ వివరాలు వాతావరణ గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాకే ప్రయాణం ప్రారంభించాలని తెలిపారు.

మొదటిరోజే రికార్డు స్థాయిలో భక్తులు
మరోవైపు మే 10 నుంచే చార్​ధామ్​ యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా కేదార్​నాథ్‌, యుమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులను భక్తుల కోసం శుక్రవారమే తెరిచారు. గత రెండు రోజులుగా కేదార్​నాథ్‌, యుమునోత్రి, గంగోత్రి ఆలయాల కూడా భక్తుల పోటెత్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం కేదార్​నాథ్​ ధామ్​ను మొదటి రోజు రికార్డు స్థాయిలో దాదాపు 29,000 మంది భక్తులు సందర్శించారు. శనివారం సాయంత్రం 4 గంటల వరకు 7,37,885 మంది బద్రీనాథ్ దర్శనం కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు. గతేడాది 18,39,591 మంది ఆలయాన్ని సందర్శించారు.

బహిరంగ చర్చకు రాహుల్​ సిద్ధం- ప్రధాని స్పందనేంటో చెప్పండంటూ ట్వీట్! - Lok Sabha Elections 2024

ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం- ఎస్​ఎం కృష్ణకు ICUలో చికిత్స - Former Karnataka CM Krishna in ICU

Last Updated : May 12, 2024, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.