Badaun Encounter Case : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ సెలూన్ షాపు యజమాని సాజిద్, ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా గొడ్డలితో నరికిచంపాడు. మరో పిల్లాడిని చంపబోగా ఆ బాలుడు త్రుటిలో తప్పించుకున్నాడు. అనంతరం ఆ బార్బర్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపారు.
వణికిపోయిన స్థానికులు
ఇటీవలే బదాయులో బార్బర్ షాప్ తెరిచిన సాజిద్, ఇద్దరు సోదరులను పొట్టనపెట్టుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. 12 ఏళ్ల ఆయుష్, 8 ఏళ్ల హనీ, 10 ఏళ్ల యువరాజ్‌పై సాజిద్ చేశాడు. వారిని భవనంపైకి తీసుకెళ్లి ఇద్దరిని గొడ్డలితో నరికిచంపాడు. ఈ దాడిలో గాయపడ్డ యువ్‌రాజ్ త్రుటిలో తప్పించుకున్నాడు. వీరు ముగ్గురూ సోదరులని జిల్లా మేజిస్ట్రేట్ మనోజ్ కుమార్ తెలిపారు. ఈ దారుణం మండి పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే జరగడం సంచలనం రేపింది.
అయితే, హత్యలు జరిగిన కొన్ని గంటల తర్వాత 22 ఏళ్ల సాజిద్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడని బరేలీ రేంజ్ ఐజీ ఆర్‌కె సింగ్ తెలిపారు. పిల్లలను చంపిన తర్వాత సాజిద్ ఇంటి నుంచి పారిపోయాడని చెప్పారు. పోలీసులకు ఎదురుపడ్డప్పుడు కూడా రక్తంతో తడిసిన దుస్తులనే ధరించి ఉన్నాడని వివరించారు. పోలీసు బృందం నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తుండగా షేఖుపూర్ అడవిలో సాజిద్ కనిపించాడని ఐజీ తెలిపారు. పోలీసులను చూసి సాజిద్ కాల్పుల జరిపాడని, ఎదురు కాల్పుల్లో హతమయ్యాడని వెల్లడించారు.
మరోవైపు ఈ దారుణ ఘటనతో భగ్గుమన్న బాధితుల కుటుంబం, స్థానికులు దుకాణాలను ధ్వంసం చేశారని, మోటార్ సైకిల్‌ను తగులబెట్టారు. ప్రస్తుతం బదాయు ప్రశాంతంగా ఉందని, ఐజీ ఆర్కే సింగ్, బరేలీ జోన్ ఏడీజీ, బరేలీ డివిజనల్ కమిషనర్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని డీజీపీ వెల్లడించారు. ఇది వ్యక్తిగత కక్ష వల్ల జరిగిందని, ఇందులో ఎలాంటి మతపరమైన కోణం లేదని కూడా డీజీపీ వెల్లడించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, సోషల్ మీడియా సెల్ కూడా ఘటనను పరిశీలిస్తోందని తెలిపారు. ఈ దాడిలో సాజిద్ అనే ఒక్కరే ఉన్నారని, మరొకరు లేరని డీజీపీ వెల్లడించారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించామని, గాయపడిన చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించామని వివరించారు.
'వ్యక్తిగత కక్షలు కాదు'
అయితే పోలీసుల వ్యాఖ్యలను మృతుల తండ్రి ఖండించారు. తాను ఇంటికి వచ్చే సమయానికి ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలిపాడు. తాము ఇంతకుముందు వారితో ఎలాంటి గొడవ పడలేదని, ఇది ఎందుకు జరిగిందో తెలీదని తెలిపారు.
-
#WATCH | Budaun Double Murder Case | Visuals from the spot after two children were murdered in the Baba colony near the Mandi Samiti outpost yesterday.
— ANI (@ANI) March 20, 2024
Budaun DM Manoj Kumar says, "We received information this evening that a man entered a house and murdered two young children… pic.twitter.com/1KwcKdqnPI
సార్వత్రిక ఎన్నికల సమరం షురూ - తొలి దశ నోటిఫికేషన్ విడుదల
డిపాజిట్ దక్కకున్నా తగ్గేదేలే!- ఇప్పటికి 71వేల మంది ఆశలు గల్లంతు