ETV Bharat / bharat

పెళ్లికి వెళ్తున్న మంత్రిపై దాడి- ముక్కుకు గాయమయ్యేలా కొట్టిన గ్రామస్థులు! - Attack On UP Minister - ATTACK ON UP MINISTER

Attack On Minister : ఓ పెళ్లికి వెళ్తున్న యూపీ మంత్రి సంజయ్ నిషాద్​పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో మంత్రి ముక్కుకు గాయమైంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు స్థానికులు.

attack on minister
attack on minister
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 5:00 PM IST

Updated : Apr 22, 2024, 5:54 PM IST

Attack On Minister : ఉత్తర్​ప్రదేశ్ మంత్రి, నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్ ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సంజయ్ నిషాద్ గాయపడ్డారు. ఆయన ముక్కు నుంచి రక్తం రావడం వల్ల వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంత్ కబీర్ నగర్​లోని మహ్మద్‌పుర్ కత్తర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై మంత్రి వ్యక్తిగత కార్యదర్శి వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

"ఆదివారం అర్ధరాత్రి సమయంలో నా కుమారుడు ప్రవీణ్ నిషాద్ సంత్ కబీర్ నగర్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని కొందరు నాతో వాగ్వాదానికి దిగారు. నేను నిషాద్ కమ్యూనిటీకి నాయకత్వం వహిస్తాను. నా కార్యకర్తలు ఎక్కడున్నా వారి వివాహాలకు తప్పకుండా హాజరవుతాను. ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆదివారం రాత్రి వెళ్తుండగా కొందరు నా కుమారుడు ప్రవీణ్ నిషాద్‌ పైనా, నిషాద్ పార్టీ పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారు మా వర్గానికి చెందిన వారే అయి ఉండొచ్చని వారిని సముదాయించేందుకు ప్రయత్నించా. అంతలోనే నాపై 20-25 మంది దాడి చేశారు. దీంతో నా కళ్లద్దాలు పగిలి ముక్కుకు గాయమైంది. నాపై దాడి చేసిన వారందరూ యాదవులే " అని మీడియాతో సంజయ్ నిషాద్ తెలిపారు.

ఆస్పత్రి వద్ద నిరసన
దాడి అనంతరం తన పార్టీ కార్యకర్తలతో కలిసి సంజయ్ నిషాద్ ఆస్పత్రి వద్ద నిరసనకు దిగారు. ఎస్పీ సత్యజిత్ గుప్తా ఆస్పత్రిలో సంజయ్ ను పరామర్శించి దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం వల్ల ఆయన నిరసనను విరమించారు. మరోవైపు, సంజయ్ నిషాద్​పై దాడిని ఉత్తర్​ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎక్స్ వేదికగా ఖండించారు. రాష్ట్రంలో గూండాయిజాన్ని సహించేది లేదని అన్నారు.

ATTACK ON UP MINSITER
ఆస్పత్రి వద్ద నిరసన

'సంజయ్ నిషాద్ పై సమాజ్ వాదీ పార్టీ గూండాలు ఘోరమైన దాడికి పాల్పడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గూండాయిజం యూపీకి తిరిగి రావడానికి అనుమతి ఇవ్వం' అని మౌర్య హెచ్చరించారు. తన తండ్రిపై దాడి ప్రతిపక్ష పార్టీల నిరాశ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయాన్ని తెలియజేస్తుందని సంజయ్ నిషాద్ కుమారుడు ప్రవీణ్ అన్నారు. 'మంత్రిపై కొందరు పోకిరీలు దాడి చేశారు. ఇది ప్రతిపక్షాల కుట్ర. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి విపక్షాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ ఘటనలో ప్రమేయమున్న వారిపై చర్యలు తీసుకోవాలి' అని ప్రవీణ్ నిషాద్ డిమాండ్ చేశారు.

ఐపీసీలోని పలు సెక్షన్లు కింద మహ్మద్‌పుర్ కత్తర్ గ్రామంలోని ఆరుగురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే రాఘవేంద్ర యాదవ్, జై ప్రకాశ్ యాదవ్, దిగ్విజయ్ యాదవ్, అభిషేక్ యాదవ్ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
అధికార ఎన్డీయేలో భాగస్వామిగా నిషాద్ పార్టీ ఉంది. ఈ పార్టీ అధ్యక్షుడిగా సంజయ్ నిషాద్ ఉన్నారు. సంజయ్ నిషాద్ కుమారుడు ప్రవీణ్ నిషాద్ సంత్ కబీర్ నగర్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

25,753 మంది ఉద్యోగాలు రద్దు- హైకోర్టు సంచ‌ల‌న తీర్పు - Teacher Recruitment Test Scam

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ బోణీ- 'సూరత్‌' ఏకగ్రీవం- చివరి నిమిషంలో కాంగ్రెస్​కు బిగ్ షాక్​ - Lok Sabha Elections 2024

Last Updated : Apr 22, 2024, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.