Arvind Kejriwal On BJP : దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతాపార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, దిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తమ ఎమ్మెల్యేలకు ఎర వేసిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆమ్‌ఆద్మీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్ల చొప్పున ముట్టజెబుతామని బీజేపీ ఆశచూపిందని ఆరోపించారు. వారందరికీ బీజేపీ నుంచి టికెట్లు కూడా ఇస్తామని నచ్చజెప్పారని తెలిపారు.
-
पिछले दिनों इन्होंने हमारे दिल्ली के 7 MLAs को संपर्क कर कहा है - “कुछ दिन बाद केजरीवाल को गिरफ़्तार कर लेंगे। उसके बाद MLAs को तोड़ेंगे। 21 MLAs से बात हो गयी है। औरों से भी बात कर रहे हैं। उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे। आप भी आ जाओ। 25 करोड़ रुपये देंगे…
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">पिछले दिनों इन्होंने हमारे दिल्ली के 7 MLAs को संपर्क कर कहा है - “कुछ दिन बाद केजरीवाल को गिरफ़्तार कर लेंगे। उसके बाद MLAs को तोड़ेंगे। 21 MLAs से बात हो गयी है। औरों से भी बात कर रहे हैं। उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे। आप भी आ जाओ। 25 करोड़ रुपये देंगे…
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2024पिछले दिनों इन्होंने हमारे दिल्ली के 7 MLAs को संपर्क कर कहा है - “कुछ दिन बाद केजरीवाल को गिरफ़्तार कर लेंगे। उसके बाद MLAs को तोड़ेंगे। 21 MLAs से बात हो गयी है। औरों से भी बात कर रहे हैं। उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे। आप भी आ जाओ। 25 करोड़ रुपये देंगे…
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2024
ప్రభుత్వాన్ని పడగొడతామని ఎమ్మెల్యేలకు బెదిరింపులు
అంతేకాక తనను త్వరలోనే అరెస్టు చేయిస్తామనీ తద్వారా ప్రభుత్వాన్ని పడగొడతామని ఎమ్మెల్యేలను బెదిరించినట్లు అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. మొత్తం 21 మంది ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరిపిందని వెల్లడించారు. దిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గత తొమ్మిదేళ్లుగా బీజేపీ పలు కుట్రలు పన్నిందని, అయితే అవన్నీ విఫలమయ్యాయని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఖండించిన బీజేపీ
మరోవైపు, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. తాము రూ.25 కోట్లు ఇస్తామన్న ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలని ఆప్‌నకు సవాల్ విసిరింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఆప్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని దిల్లీ బీజేపీ సెక్రటరీ హరీశ్ ఖురానా మండిపడ్డారు.
'కేజ్రీవాల్ మళ్లీ అబద్దాలు చెబుతున్నారు'
ఆప్ నేతలను ఎవరు సంప్రదించారో చెప్పాలని బీజేపీ నేత కపిల్ మిశ్రా డిమాండ్ చేశారు. గతంలోలానే కేజ్రీవాల్ మళ్లీ అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. 'ఆప్ నేతలను ఎవరు సంప్రదించారు. ఎక్కడ సమావేశం నిర్వహించారు. కేజ్రీవాల్ కేవలం స్టేట్‌మెంట్‌లు ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. ఆయన భాగస్వాములు జైలులో ఉన్నారు. ఈడీ ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేవు. అందుకే కేజ్రీవాల్ పదేపదే ఈడీ సమన్లను తప్పించుకుంటున్నారు.' అని కపిల్ మిశ్రా ఆరోపించారు.
దిల్లీ ముఖ్యమంత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కొద్ది రోజుల క్రితం ఈడీ నాలుగోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయినా దిల్లీ ముఖ్యమంత్రి ఈడీ విచారణకు హాజరుకాలేదు.
'ఆదివారమే బిహార్‌లో కొత్త సర్కారు- సీఎంగా మళ్లీ నీతీశ్'- అడ్డుకునేలా లాలూ స్కెచ్!
టీపార్టీకి దూరంగా తేజస్వి- తనకు తెలియదన్న నీతీశ్- బిహార్‌లో ఏం జరుగుతోంది?