Aravind Kejriwal Supreme Court : మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కారణంగా దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సింది దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అని స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ తత్తాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అరెస్టు చేసిన తర్వాత ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరడం న్యాయబద్ధమైన విషయమని, కానీ దానికి చట్టపరమైన హక్కు లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు ఏప్రిల్ 10న కొట్టివేసింది. అనంతరం పిటిషనర్ కాంత్ భాటి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.
అదే జరిగితే, జూన్ 5నే బయటకు వస్తా : అరవింద్ కేజ్రీవాల్
మరోవైపు, సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే జూన్ 5నే తాను తిహాడ్ జైలు నుంచి విడుదలవుతానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన కేజ్రివాల్ పార్టీ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు తనను అవమానపరిచే ప్రయత్నాలు జరిగాయని ఆయన చెప్పారు. తిహాడ్ జైలులోని తన గదిలో రెండు సీసీటీవీ కెమెరాలు అమర్చారని, ఆ దృశ్యాలను 13 మంది అధికారులు పర్యవేక్షించారని ఆరోపించారు. సీసీటీవీ దృశ్యాలను ప్రధాని కార్యాలయానికి అధికారులు అందజేసినట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. మోదీ తనను గమనించే వారని కౌన్సిలర్లతో చెప్పారు. తనపై మోదీకి ఎలాంటి పగ ఉందో తెలియదన్నారు. ప్రజలు ఆమ్ ఆద్మీ నేతలను గౌరవిస్తున్నారని, ప్రేమిస్తున్నారని వివరించారు. ఆప్ సర్కార్ పనిచూసి బీజేపీ భయపడుతోందన్నారు. జూన్ 2న తిరిగి జైలుకు వెళతానన్న కేజ్రీవాల్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలను జైలు నుంచే చూస్తానని చెప్పారు. తనను అరెస్ట్ చేసినతర్వాత ఆమ్ ఆద్మీ మరింత సమైక్యంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు.
CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల- మళ్లీ అమ్మాయిలే టాప్ - CBSE Class 12 results
నాలుగో దశ పోలింగ్‌కు అంతా రెడీ- బరిలో 1717మంది- ఓటర్లు ఎవరికి జై కొడతారో? - Lok Sabha Polls Phase 4