Anant Ambani Wedding Menu : అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంటే అవి మామూలుగా ఉండవు. పెళ్లి పత్రిక నుంచి వివాహ వేదిక వరకు, ధరించే దుస్తులు నుంచి అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ ప్రత్యేకమే. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మార్చెంట్‌ల నిశ్చితార్థం మొదలు, ప్రీ వెడ్డింగ్ వేడుకల వరకు ఆ ఇంట్లో జరిగే ప్రతీ కార్యక్రమం కనీవినీ ఎరుగని రీతిలో చేశారు.
మార్చి నెలలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో, అతిథులకు దాదాపు 2,500 రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు. అప్పుడే ఇన్ని రకాల వంటకాలతో భోజనాలు పెడితే, పెళ్లికి ఇంకెన్ని రకాల వంటలు వండుతారో మీరే ఊహించుకోండి.
ది బిగ్గెస్ట్ జెంబో మెనూ ఇదే!
జులై 12న ఇచ్చే పెళ్లి విందుకు సంబంధించిన మొత్తం మెనూ గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు. కానీ వీటిలో కొన్ని వంటకాల వివరాలు మాత్రం ఇప్పుడు బయటకు తెలిసిపోయాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వారణాశిలో అత్యంత ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్ స్టాల్ వాళ్లు ఈ పెళ్లి విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ చాట్ బండార్ యజమానే స్వయంగా ముఖ్య అతిథుల(వీఐపీ)కు వడ్డించనున్నారు. ఇంతకూ మెనూలో ఏమున్నాయంటే?
కుల్ఫీ, ఫలూదా, టిక్కీ, టమాటా చాట్, పాలక్ చాట్, చనా కచోరి, దహీ పూరి, బనారస్ చాట్ లాంటి స్పెషల్స్‌ను అతిథుల కోసం తయారు చేయనున్నారు. వీటిని ముకేశ్ అంబానీ సతీమణి అయిన నీతా అంబానీయే స్వయంగా ఎంపిక చేశారట.
నీతా అంబానీ జూన్ 24న పెళ్లి పత్రిక తీసుకొని కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్లిన సంగతి తెలిసిందే. మార్గమధ్యంలో ఆ చాట్ బండార్‌కు వెళ్లి, అక్కడి పదార్థాలను రుచి చూసి ముగ్ధులయ్యారట. వెంటనే ఆ స్టాల్ యజమాని కేసరితో మాట్లాడి, తన కుమారుడి పెళ్లిలో ఈ వంటకాలు పెట్టాలని కోరారట. దీనికి తాను అంగీకరించినట్లు కేసరి తాజాగా మీడియాకు తెలిపారు.
పెళ్లి వేడుకలు
అనంత్ అంబానీ వివాహం, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికతో జులై 12న జరగనుంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పెళ్లి జరగనుంది. 3 రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. జులై 12న శుభ్ వివాహ్‌తో వేడుకలు మొదలవుతాయి. జులై 13న శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్‌తో ఈ పెళ్లి వేడుకలు ముగుస్తాయి.
రష్యా సైనికులు వేసుకునే బూట్లు మనవే- ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? - Russian Army Shoes