ETV Bharat / bharat

'ముస్లిం వ్యక్తికి భార్య ఉండగా సహజీవనం చేసే హక్కు లేదు'- హైకోర్టు కీలక వ్యాఖ్యలు - HC On Muslim Live In Relationship

Allahabad HC On Muslim Live In Relationship : జీవిత భాగస్వామి ఉండగా వేరే మహిళతో సహజీవనం చేసే హక్కు ముస్లిం వ్యక్తి పొందలేడని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. సహజీవనం చేస్తున్న ఓ జంట, మహిళ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్​పై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

Allahabad HC On Muslim Live In Relationship
Allahabad HC On Muslim Live In Relationship (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 11:10 AM IST

Allahabad HC On Muslim Live In Relationship : ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తికి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. తన జీవిత భాగస్వామితో విడాకులు పొందకుండా వేరొక వ్యక్తితో కలిసి ఉండటం ముస్లిం వివాహ చట్టం ప్రకారం అనుమతించదని కోర్టు అభిప్రాయపడింది. సహజీవనం చేస్తున్న ఓ జంట, మహిళ కుటుంబ సభ్యుల నుంచి భద్రత కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదీ కేసు
2020లో షాదాబ్ అనే వ్యక్తి ఫరీదా ఖాతూన్​ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం ఫరీదా తన తల్లిదండ్రుల దగ్గర జీవిస్తోంది. ఈ క్రమంలో షాదాబ్ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే తన సోదరిని కిడ్నాప్​ చేశాడంటూ షాదాబ్​పై సదరు మహిళ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఫిర్యాదును షాదాబ్ అలహాబాద్ హై కోర్టులో సవాల్ చేశాడు. తాము ఇష్టప్రకారమే కలిసి జీవిస్తున్నామని, తనపై కిడ్నాప్​ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటషన్ దాఖలు చేశాడు. అలాగే మహిళ కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని పిటిషన్​లో​ పేర్కొన్నాడు. వారు తమ రిలేషన్​షిప్​లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.

దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు, ​ఆర్టికల్ 21 ప్రకారం ఈ కేసులో ఎటువంటి రక్షణను కల్పించలేమని తెలిపింది. ముస్లిం చట్టం ప్రకారం జీవిత భాగస్వామి ఉండగా వేరే వ్యక్తితో సహజీవనం చేయడానికి అనుమతి ఉండదని పేర్కొంది. అందుకే రక్షణ కల్పించలేమని చెప్పింది.

ఫేక్​ రేప్​ కేసు పెట్టిన మహిళకు 4ఏళ్లు శిక్ష
Youth Gets Justice After 4 Years : ఓ మహిళ తప్పుడు కేసుకు బలయ్యాడు ఓ యువకుడు. చేయని తప్పుకు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడం వల్ల 4ఏళ్ల 6నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు. మహిళ తప్పడు కేసు పెట్టినందుకు ఆమెకు జైలు శిక్ష విధిస్తూ ఇటీవలే సంచలన తీర్పునిచ్చింది కోర్టు. పూర్తి వివరాలు కోసం ఈలింక్​ పై క్లిక్ చేయండి.

'100మందికే సీసీటీవీ వీడియో చూపిస్తా'- లైంగిక వేధింపులు ఆరోపణలపై బంగాల్​ గవర్నర్​ షాకింగ్​ నిర్ణయం - BENGAL GOVERNOR MOLESTATION Issue

'అంబానీ-అదానీ నుంచి రాహుల్​కు డబ్బు ట్రక్కులు'- మోదీ వ్యాఖ్యలపై గాంధీ ఫైర్​ - Rahul Gandhi On PM Modi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.