ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో స్థానిక పార్టీల 'ఫ్రీ కరెంట్' జపం - ఈ హామీ ఓట్లు రాలుస్తుందా? - Jammu And Kashmir Elections

Jammu and Kashmir Assembly Elections 2024 : జమ్ముకశ్మీర్​లో స్థానిక పార్టీలు 'ఉచిత కరెంట్' జపం చేస్తున్నాయి. కొన్ని పార్టీలు 200 యూనిట్లు, మరికొన్ని 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని మ్యానిఫెస్టోలో చేర్చాయి. కరెంట్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల ఓట్లను రాబట్టుకునేందుకు ఈ ఉచిత విద్యుత్ మంత్రాన్ని పార్టీలు జపిస్తున్నాయి. అందుకే ఈ ఉచిత విద్యుత్ అమలు సాధ్యాసాధ్యాలపై ఓ లుక్కేద్దాం పదండి.

Jammu and Kashmir Elections
Jammu and Kashmir Elections (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 1:58 PM IST

Jammu and Kashmir Assembly Elections 2024 : మరికొద్ది రోజుల్లో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 10 ఏళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు హామీలు గుప్పిస్తున్నాయి. అందులో ప్రధానమైనది ఉచిత విద్యుత్. జమ్ముకశ్మీర్​లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఉచిత విద్యుత్ వాగ్దానంతో పార్టీలు ముందుకెళ్తున్నాయి. జమ్ముకశ్మీర్​లో నెలకొన్న దీర్ఘకాలిక విద్యుత్ కొరతను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని హామీలు ఇస్తున్నాయి. మరి ఈ ఉచిత విద్యుత్ హామీ ఓట్లను రాలుస్తుందా? ఆ హామీ అమలు సాధ్యమేనా? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన స్థానిక పార్టీలు
జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP), అప్నీ పార్టీ ఇలా పలు పార్టీలు ఉచిత విద్యుత్‌ హామీని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చాయి. జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, పీడీపీ పార్టీలు - గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ను అందిస్తామని హామీ ఇచ్చాయి. అప్నీ పార్టీ మరో అడుగు ముందుకేసి తాము అధికారంలోకి వస్తే కశ్మీర్​లో శీతాకాలంలో, జమ్మూలో వేసవిలో 500 యూనిట్ల ఉచిత విద్యుత్​ను అందిస్తామని వాగ్దానం ఇచ్చింది. మరి ఈ వాగ్దానాల అమలు విద్యుత్ కొరతతో ఇబ్బందిపడుతున్న జమ్ముకశ్మీర్లో సాధ్యమవుతాయా? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది.

ఓట్లను రాబట్టుకునేందుకే!
అస్థిరమైన విద్యుత్ సరఫరాతో విసిగిపోయిన జమ్ముకశ్మీర్ ప్రజల ఓట్లను రాబట్టుకునేందుకు పలు పార్టీలు ఉచిత కరెంట్ హామీని తీసుకొచ్చాయి. ఎందుకంటే శీతాకాలంలో జమ్ముకశ్మీర్ ప్రజలు కరెంట్ సమస్యలతో విసిగిపోతున్నారు. అయితే ఈ హామీల అమలు సాధ్యాసాధ్యాలు అస్పష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన పార్టీలు దాని అమలుపై వివరణాత్మక ప్రణాళికలను వెల్లడించలేదు. మరోవైపు 2023లో తలసరి ఆదాయవృద్ధి పరంగా జమ్ముకశ్మీర్ కేవలం 14.8 శాతం రేటుతో దేశంలో 27వ స్థానంలో నిలిచింది. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంలో ఉచిత విద్యుత్ హామీ సాధ్యమేనా? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఉచిత విద్యుత్ సాధ్యమేనా?
జమ్ముకశ్మీర్ గణనీయమైన విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, దానిలో ఎక్కువ భాగం ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతుందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అందుకే కశ్మీర్​లో విద్యుత్ కొరత ఉందని ఆరోపించారు.

స్థానిక పార్టీల ప్రధాన అజెండా ఉచిత విద్యుత్
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత విద్యుత్ ప్రధాన అజెండాగా మారిందని అప్నీ పార్టీ సీనియర్ నాయకుడు రఫీ మీర్ అభిప్రాయపడ్డారు. ప్రతి స్థానిక పార్టీ తమ మ్యానిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీకి ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపారు. కాగా, జమ్ముకశ్మీర్ లోని కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తమ మ్యానిఫెస్టోలో ఉచిత కరెంట్ హామీ ఇస్తున్నాయని బీజేపీ ఆరోపించింది.

అనుమానం వ్యక్తం చేసిన బీజేపీ
జమ్ముకశ్మీర్​లో ప్రస్తుతం 2,160 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి అవుతోందని, దీన్ని 5000 మెగావాట్లకు పెంచేందుకు భారీ ఎత్తున ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని బీజేపీ నేత దరఖాన్ ఆంద్రాబీ తెలిపారు. ఇంతటి ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, జమ్ముకశ్మీర్ విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతోందని ఆరోపించారు. ప్రజలకు ఉచిత కరెంటు ఇస్తామని పలు పార్టీలు హామీ ఇస్తున్నాయని, దాన్ని నిజంగా నేరవేర్చగలవా? అని ప్రశ్నించారు. ఈ వాగ్దానాలు మ్యానిఫెస్టో పేపర్లకే పరిమితమవుతాయని ఎద్దేవా చేశారు.

వేడెక్కిన జమ్ముకశ్మీర్​ రాజకీయం- కాంగ్రెస్​, ఎన్​సీ పొత్తుతో కుదేలైన PDP! బీజేపీతో మళ్లీ కలుస్తుందా? - Jammu Kashmir Assembly Elections

'ఇండియా' కూటమికి మరో షాక్- కశ్మీర్​లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరి పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.