ETV Bharat / bharat

'ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదు'- కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ - tmc allegations on aadhaar

Aadhaar Not Mandatory For Voting EC : ఓటు వేసేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటరు ఐడీ లేదా ఇతర నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని పేర్కొంది.

Aadhaar Not Mandatory For Voting EC
Aadhaar Not Mandatory For Voting EC
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 10:09 PM IST

Aadhaar Not Mandatory For Voting EC : ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆధార్ కార్డు లేకపోతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆపబోమని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేదా ఏదైనా ఇతర నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని చూపించి ఓటు హక్కును వినియోగించవచ్చని పేర్కొంది. ఓటర్లు ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని హామీ ఇచ్చింది.

బంగాల్​ ప్రజల ఆధార్ కార్డులను కేంద్రం డీయాక్టివేట్ చేస్తోందని టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే, డోలా సేన్, సాకేత్ గోఖలే, లోక్‌సభ ఎంపీలు ప్రతిమా మోండల్, సజ్దా అహ్మద్‌లతో కూడిన టీఎంసీ ప్రతినిధి బృందం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​ను కలిసింది. తమ రాష్ట్రంలో ఆధార్ కార్డుల డీయాక్టివేషన్​పై వస్తున్న ఆరోపణలను లేవనెత్తింది. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం టీఎంసీ బృందానికి హామీ ఇచ్చింది. ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

'బంగాల్‌లో వేల మంది ప్రజల ఆధార్ కార్డులను చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా డీయాక్టివేట్ చేయడంపై మా ఆందోళనలను కేంద్రం ఎన్నికల సంఘం ముందు లేవనెత్తాం. రాష్ట్రంలో మోహరించిన కేంద్ర బలగాలు తమ పరిధిలో పని చేసేలా చూడాలని కోరాం. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్​, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో కేంద్ర బలగాలు చట్టానికి అనుగుణంగా పనిచేసేలా ఆదేశాలివ్వాలని కోరాం.' అని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్​ను కలిసిన అనంతరం రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే మీడియాతో చెప్పారు.

కేంద్రంపై మమత విమర్శలు
Mamata Banerjee On Aadhar Card Deactivated : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవలే సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఆధార్​ కార్డులను డీయాక్టివేట్​ చేస్తోందని దీదీ విమర్శించారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరనీయడం లేదని ఆరోపించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ప్రజల సలహాల నుంచే మేనిఫెస్టో- మోదీ అభివృద్ధిని చాటేలా బీజేపీ ప్రచారం​

రాజకీయ పార్టీల హామీలపై ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు- నోటిఫికేషన్​పైనా క్లారిటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.