ETV Bharat / bharat

'పవర్​'ఫుల్ లిఫ్టర్- 80 కేజీలు ఎత్తేస్తున్న బుడతడు- ఆరేళ్లకే 17 మెడల్స్ - little power lifter in surat

6 Years Old Powerlifter In Surat : సాధారణంగా ఆరేళ్ల వయసు అంటే బొమ్మలతో ఆడుకుంటూ సరదాగా టీవి చూస్తూ ఉంటారు. కానీ ఓ గుజరాత్​కు చెందిన ఆరేళ్ల బాలుడు మాత్రం వయసుకు మించిన పనులు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. వెయిట్​ లిఫ్టింగ్​లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఆ లిటిల్ వెయిట్ లిఫ్టర్ ఎవరో చూద్దాం.

6 Years Old Powerlifter In Surat
6 Years Old Powerlifter In Surat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 10:06 PM IST

'పవర్​'ఫుల్ లిఫ్టర్- 80 కేజీలు ఎత్తేస్తున్న బుడతడు- ఆరేళ్లకే 17 మెడల్స్

6 Years Old Powerlifter In Surat : ఇక్కడ కనిపిస్తున్న బాలుడి వయసు ఆరేళ్లు.. చదివేది ఒకటో తరగతి అయినా పవర్ లిఫ్టింగ్​లో సత్తా చాటుతున్నాడు. తన బరువుకు మించి వెయిట్​ లిఫ్టింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 80 కిలోల బరువును సులభంగా ఎత్తుతూ రికార్డులు కొల్లగొడుతున్నాడు గుజరాత్​లోని సూరత్​కు చెందిన యతి జెఠ్వా.

6 Years Old Powerlifter In Surat
వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్న యతి జెఠ్వా

ఇప్పటికే వెయిట్​ లిఫ్టింగ్​లో 17కు పైగా పతకాలు సాధించాడు లిటిల్ పవర్ లిఫ్టర్ యతి. తనకు పవర్​లిఫ్టింగ్ అంటే చాలా ఇష్టమని, ఈ రంగంలో మంచి పేరు సంపాదించాలని అనుకుంటున్నానని చెబుతున్నాడు.

6 Years Old Powerlifter In Surat
సాధించిన పతకాలు, ట్రోఫీలతో యతి జెఠ్వా

" నేను రోజూకు రెండు గంటలు పాటు ప్రాక్టీస్​ చేస్తాను. ఉదయం చదువుకుంటాను. సాయంత్రం జిమ్​లో ప్రాక్టీస్ చేస్తాను. డైట్​గా నేను ఉదయం పాలు, అరటిపండు తీసుకుంటా. మధ్యాహ్నం అన్నం, రాత్రికి చపాతీ తింటాను. ప్రస్తుతం 80 కేజీల బరువును ఎత్తున్నాను. భవిష్యత్తులో నేను 100 కేజీలు ఎత్తాలని అనుకుంటున్నాను " - యతి జెఠ్వా, పవర్ లిఫ్టర్

తండ్రిని చూస్తూ కసరత్తులు
వెయిట్​ లిఫ్టింగ్​లో యతికి అతడి తండ్రి రవి జెఠ్వా ట్రైనింగ్​ ఇస్తున్నాడు. యతికి రెండేళ్ల ఉన్నప్పుడు అతడిని తనతో పాటు జిమ్​కు తీసుకెళ్లేవాడు. అప్పటి నుంచే యతికి ఈ వెయిట్​ లిఫ్టింగ్​పై ఆసక్తి పెరిగిందని రవి జెఠ్వా చెబుతున్నాడు.

6 Years Old Powerlifter In Surat
జిమ్​లో ప్రాక్టీస్​ చేస్తున్న యతి జెఠ్వా

"నేను వర్కౌట్క్​ చేసేటప్పుడు నన్ను చూసి యతి కూడా చేయడానికి ప్రయత్నం చేసేవాడు. అలా చిన్న వర్కౌట్క్ చేస్తూ ఇప్పుడు తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. భవిష్యత్​లో కచ్చితంగా స్టార్​ అవుతాడు. అలానే ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తాడు. ఈ వయసులో చిన్న పిల్లలు అందరూ మొబైల్స్​ చూడటం, బొమ్మలతో ఆడుకుంటూ బిజీగా ఉంటారు. చిన్న వయసులోనే ఎక్కువ బరువులను మోస్తే ఎత్తు పెరగరు అని అంటారు. కానీ అలా ఏమీ కాదు."
- రవి జెఠ్వా, యతి తండ్రి

పవర్​లిఫ్టింగ్​లో యతి 9వ కేటగిరీలోకి వస్తాడు. కానీ ఆ కేటగిరీలోని ఏ పిల్లలు కూడా తనకు పోటీ ఇవ్వలేనంత భారీ బరువును యతికి ఎత్తున్నాడని రవి జెఠ్వా చెబుతున్నాడు.

రెండేళ్లకే రికార్డు.. అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పేస్తున్న బుడతడు

5 Year Old Boy Hanuman Chalisa Record : హనుమాన్​​ చాలీసా చదివి బాలుడి రికార్డ్​.. రాష్ట్రపతి​ నుంచి ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.