ETV Bharat / bharat

అగ్రనేతల భవితవ్యాన్ని తేల్చే రెండో దశ- ఎన్నికల బరిలో 1210 మంది - 2024 Lok Sabha elections phase 2 - 2024 LOK SABHA ELECTIONS PHASE 2

2024 Lok Sabha elections phase 2 : ఏప్రిల్‌ 26న జరగనున్న లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి మొత్తం 12 వందల 10 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 88 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌ వంటి ప్రముఖ నేతలు రెండో దశ ఎన్నికల బరిలో నిలిచారు.

2024 Lok Sabha elections phase 2
2024 Lok Sabha elections phase 2
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 5:11 PM IST

2024 Lok Sabha elections phase 2 : లోక్‌సభ ఎన్నికల మెుదటి విడత పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరనుండగా రెండో దశ ఎన్నికలు ఏప్రిల్‌ 26న జరగనున్నాయి. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 88 నియోజకవర్గాలకు రెండో విడతలో పోలింగ్‌ జరగనుంది. కేరళలో అత్యధికంగా 20 స్థానాలు, కర్ణాటకలో 14, రాజస్థాన్‌ 13, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ర్టల్లో చెరో 8, మధ్యప్రదేశ్‌లో 7 స్థానాలకు రెండో విడతలో భాగంగా ఎన్నికలు జరగనున్నాయి. అసోం, బిహర్‌లో చెరో 5, ఛత్తీస్‌గఢ్, బంగాల్‌లో చెరో 3, త్రిపుర 1 స్థానం, ఔటర్‌ మణిపుర్‌, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఒకస్థానానికి రెండోవిడతలో పోలింగ్‌ జరగనుంది. మెుత్తం 88 నియోజకవర్గాల్లో 12 వందల 10 మంది అభ్యర్థులు ఏప్రిల్‌ 26న తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

రెండో దశలో పోటీకి సిద్ధమైన 1,210 మంది అభ్యర్థులు
రెండో విడతలో ఎన్నికలు జరగనున్న 88 నియోజకవర్గాలకు మొత్తం 2, 633 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. వాటి పరిశీలన అనంతరం 1,428 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని వెల్లడించింది. కొందరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడం వల్ల చివరికి 1,210 బరిలో నిలిచినట్లు పేర్కొంది. రెండో విడతలో కేరళలో 20 లోక్‌సభ స్థానాల నుంచి అత్యధికంగా ఐదు వందల నామినేషన్లు వచ్చినట్లు వివరించింది. కర్ణాటకలోని 14 స్థానాల నుంచి 491 నామినేషన్లు వచ్చాయని తెలిపింది. త్రిపురలో ఒక స్థానం నుంచి అత్యల్పంగా 14 నామినేషన్లు వచ్చాయని వెల్లడించింది. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి గరిష్ఠంగా 92 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఔటర్ మణిపుర్‌లోని పార్లమెంటరీ నియోజకవర్గంలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఏప్రిల్ 19న మొదటి దశలో, మిగిలిన 13 అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఏప్రిల్ 26న రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

బరిలో అగ్రనేతలు
రెండోదశ ఎన్నికల్లో పలువురు అగ్రనేతలు బరిలో ఉన్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా రాజస్థాన్‌ కోటా నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌ నుంచి మరోసారి బరిలో నిలిచారు. కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌ రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేత, సిట్టింగ్‌ ఎంపీ శశిథరూర్‌ తిరువనంతపురంలో రాజీవ్‌ చంద్రశేఖర్‌ సవాలు విసురుతున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 19న మొదలై ఏడు విడతల్లో జూన్‌ 1 వరకు జరనున్నాయి. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఎన్నికల్లో నా కుమారుడు ఓడిపోవాలి- కాంగ్రెస్ నా మతం: ఏకే ఆంటోనీ - AK Antony Son In Lok Sabha Polls

తొలి విడత ఎన్నికల్లో 135 మంది మహిళలు పోటీ- కేవలం 8 శాతమే - Women In LS Polls 2024 1st Phase

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.