ETV Bharat / bharat

151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలపై మహిళల్ని వేధించారని కేసులు- 16మందిపై అత్యాచారం ఆరోపణలు! - Criminal Cases On MLAs And MPs

Criminal Cases On Sitting MLAs And MPs : దేశంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో 151 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్(ADR) వెల్లడించింది. అందులో 16మందిపై అత్యాచార ఆరోపణలు ఉన్నట్లు కూడా తెలిపింది.

Criminal Cases On Sitting MLAs And MPs
Criminal Cases On Sitting MLAs And MPs (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 5:26 PM IST

Updated : Aug 21, 2024, 6:22 PM IST

Criminal Cases On Sitting MLAs And MPs : దేశంలోని 151 మంది సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని ప్రముఖ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్ (ADR) వెల్లడించింది. అందులో బంగాల్​కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా 151 మంది చట్టసభ్యుల్లో 16 మందిపై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నట్లు ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్​కు చెందిన చెరో ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పింది.

2019-2024 మధ్య ఎన్నికల సమయంలో భారత ఎన్నికల కమిషన్‌కు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమర్పించిన 4809 అఫిడవిట్లలో 4,693 విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు ఏడీఆర్‌ పేర్కొంది. అందులో మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు గుర్తించింది. బంగాల్​కు చెందిన 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అందులో ఉన్నారని తెలిపింది. 21 మంది చట్టసభ్యులతో ఆంధ్రప్రదేశ్​ రెండో స్థానంలో ఉందని నివేదికలో పేర్కొంది. ఒడిశాకు చెందిన వారు 17 మంది ఉన్నట్లు చెప్పింది.

ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ!
దేశంలోని 16 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అత్యాచారం కేసులు ఎదుర్కొంటున్నారని, వీరిపై నేరాలు రుజువైతే 10 ఏళ్లు లేదా జీవిత కారాగార శిక్ష పడే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. అత్యధికంగా 54 మంది బీజేపీ నేతలు ఈ తరహా కేసులు ఎదుర్కొంటుండగా, 24 మంది కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో జరిగిన జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ నివేదిక వెలువడడం గమనార్హం.

ఫాస్ట్‌ ట్రాక్‌ విచారణ జరగాలి: ఏడీఆర్
అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా ఏడీఆర్‌ కోరింది. సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. మహిళలపై నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న నేతలకు రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వకపోతే బాగుండేదని అభిప్రాయపడింది. నేరాలు చేసినట్లు కేసులు ఉన్న అభ్యర్థులను దూరం పెట్టాలని ఓటర్లను కోరింది.

46శాతం కొత్త ఎంపీలపై క్రిమినల్​ కేసులు- దోషులుగా తేలిన 27మంది : ADR - Criminal Cases On Newly Elected MPs

లోక్‌సభ విజేతల సగటు ఓట్లు 50.58%- 297మందికే సగానికి పైగా ఓట్లు - Lok Sabha Polls winners voting

Last Updated : Aug 21, 2024, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.