యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో చోటుచేసుకున్న వరుస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని రేపు న్యాయస్థానంలో ప్రవేశపెట్టె అవకాశం ఉంది. నల్గొండలోని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానంలోని ఫోక్సో చట్టం కోర్టులో నిందితుడికి.. సాక్షుల వాంగ్మూలాలను వినిపించే ప్రక్రియ కొనసాగనుంది. వాంగ్మూలాల వివరాల్ని నిందితునికి చదివి వినిపించిన అనంతరం... శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత ఇరు పక్షాల వాదనలు కొనసాగుతాయి. ఇందుకు మరో వారానికి పైగా సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అనంతరమే తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది.
రేపు కోర్టుకు హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని రేపు న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశముంది. ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు కావడం వల్ల... నిందితుడికి సాక్షుల వాంగ్మూలాలను చదివి వినిపించనున్నారు.
రేపు కోర్టుకు హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి