ETV Bharat / state

ఈనెల 26న నల్గొండ జిల్లా కోర్టుకు సైకో శ్రీనివాస్​రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్​ వరుస హత్యల కేసుల్లో నిందితుడు సైకో శ్రీనివాస్​రెడ్డిపై విచారణ కొనసాగుతోంది. ముగ్గురు విద్యార్థినులను హత్య చేసిన కేసులో 101 మంది వాంగ్మూలాలను పోలీసులు సేకరించారు.

investigation on psycho srinivas reddy the occused of three murders at hajipur in yadadri bhuvanagiri district
నల్గొండ జిల్లా కోర్టుకు సైకో శ్రీనివాస్​రెడ్డి
author img

By

Published : Dec 24, 2019, 4:34 PM IST

నల్గొండ జిల్లా కోర్టుకు సైకో శ్రీనివాస్​రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో సాక్షుల వాంగ్మూలాలు పూర్తయ్యాయి. ముగ్గురు విద్యార్థినులను దారుణంగా హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్​రెడ్డిపై విచారణ జరుగుతోంది.

మూడు కేసుల్లో నూటా ఒక్కమంది వాంగ్మూలాలను పోలీసులు సేకరించారు. నల్గొండలోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టులోని పోక్సో చట్టం కోర్టు ఈ వాంగ్మూలాలపై విచారణ సాగిస్తోంది.

నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఈ నెల 26న కోర్టులో హాజరుపరచనున్నారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను... అదే రోజు నిందితుడికి చదివి వినిపించనున్నారు. తదనంతరం వాటిపై... శ్రీనివాస్ రెడ్డి నుంచి అభిప్రాయాన్ని రికార్డు చేస్తారు.

ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇరుపక్షాల న్యాయవాదులు... తుది వాదనలు వినిపిస్తారు. మరో వారంలోగా.. ముగ్గురు విద్యార్థినుల హత్య కేసుపై తీర్పు వెలువడే అవకాశం ఉంది.

Intro:Body:

TG_NLG_02_24_Hajipur_Case_AV_3067451

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.