గ్రామ పంచాయతీ పనుల్లో నిర్లక్ష్యం వహించే సర్పంచ్, ఉప సర్పంచ్‌లను పదవుల నుంచి తొలగించే అధికారం తనకు ఉందని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. 30 రోజుల గ్రామ పంచాయతీల ప్రణాళిక, కార్యచరణపై నర్సంపేటలో అవగాహన సదస్సు నిర్వహించారు. సస్పెండ్ చేసే అవకాశాన్ని తనకు ఇవ్వకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. అభివృద్ధి చెందిన గ్రామానికి, మండలానికి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతిని అందిస్తామని హరిత తెలిపారు. అభివృద్ధి చెందని గ్రామాన్ని చెత్త గ్రామ పంచాయతీగా గుర్తించి గ్రామ ప్రజా ప్రతినిధులను, పంచాయతీ కార్యదర్శులను తొలగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు, వరంగల్ రూరల్ జిల్లా ఇంఛార్జీ జడ్పీ ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్, జిల్లా అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం చేస్తే సర్పంచ్, ఉప సర్పంచ్‌ను తొలగిస్తాం: కలెక్టర్ హరిత
వరంగల్ గ్రామీణ జిల్లాలోని నర్సంపేట పట్టణంలో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యచరణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సస్పెండ్ చేసే అవకాశాన్ని నాకివ్వొద్దు : కలెక్టర్