తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొత్త పుర కార్యాలయం... పట్టణంలోనే నిర్మించాలి' - 'కొత్త పుర కార్యాలయం... పట్టణంలోనే నిర్మించాలి'

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ భవన నిర్మాణానికి చేపట్టిన టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేసి...పట్టణంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు.

పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలి : కాంగ్రెస్
పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలి : కాంగ్రెస్

By

Published : Dec 16, 2019, 5:58 PM IST

Updated : Dec 16, 2019, 11:48 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. నూతన పుర కార్యాలయ భవన నిర్మాణానికి చేపట్టిన టెండర్లను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కాకుండా సమీపంలోనే నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. అనంతరం టెండర్ ప్రక్రియను నిలిపేయాలని మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం సమర్పించారు.

కొత్త మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ఉన్నచోటనే నిర్మిస్తామని... స్థానిక మేధావులకు, ప్రజా ప్రతినిధులకు, హామీ ఇచ్చిన ఎమ్మెల్యే... తుంగలో తొక్కారని అన్నారు. పట్టణానికి 2 కిమీల దూరంలో నూతన భవన నిర్మాణానికి టెండర్లకు అనుమతించడం ఏమిటని డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి ప్రశ్నించారు.

'అలా అయితే సామాన్యులు రోజంతా నష్టపోతారు'

పుర కార్యాలయం పట్టణ ప్రజలకు దూరంగా ఉంటే సామాన్యులకు ఒకరోజు సమయం అంతా వెచ్చించాల్సి వస్తుందన్నారు. పట్టణానికి దూరంలో కాకుండా అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలోనే మున్సిపల్ నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో హుస్నాబాద్ పట్టణంలోని వాడవాడల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. వెంటనే చేపట్టిన టెండర్ ప్రక్రియను నిలిపేసి... ప్రజలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని భవన నిర్మాణానికి కేటాయించాలని కోరారు.

పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలి : కాంగ్రెస్

ఇవీ చూడండి : ప్రైవేట్​ బడికి సై... సర్కార్​ బడి నయ్​!

Last Updated : Dec 16, 2019, 11:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details