తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో ఉద్రిక్తత.. మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని చంద్రశేఖర్​కాలనీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస అభ్యర్థి, కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడున్న మహిళలను నెట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. పోలీసుల తీరు ఎంపీ అర్వింద్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

police loti charge on bjp workers in nizamabad
నిజామాబాద్​లో ఉద్రిక్తత.. మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు

By

Published : Jan 22, 2020, 5:50 PM IST

మహిళలపై పోలీసులు దాష్టీకంగా వ్యవహరించారు. ఆడవారని చూడకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన నిజామాబాద్​లో జరిగింది. పోలీసుల తీరుపై ఎంపీ అర్వింద్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్​కాలనీలో తెరాస అభ్యర్థి, కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడున్న మహిళలను నెట్టేసి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు.

అదనపు సీపీకి ఫిర్యాదు

లాఠీ చార్జీ చేసి భాజపా అభ్యర్థితో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ అర్వింద్ ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేసినా భాజపా అభ్యర్థి, కార్యకర్తలను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అనంతరం ఏసీపీ కార్యాలయంలో అదనపు సీపీకి ఫిర్యాదు చేశారు. మహిళను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళను ఈడ్చుకుంటూ వెళ్లే, లాఠీ ఛార్జి చేసే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజామాబాద్​లో ఉద్రిక్తత.. మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details