కాంగ్రెస్, భాజపాలకు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో... తెరాస అభ్యర్థులకు మద్దతుగా పలు వార్డుల్లో రోడ్ షో నిర్వహించి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే అభ్యర్థుల విజయానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
మేడ్చల్ మున్సిపాలిటీలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం
పుర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మేడ్చల్ మున్సిపాలిటీలో తెరాస అభ్యర్థుల తరఫున మంత్రి మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ సర్కారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే ఎన్నికల్లో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
మేడ్చల్ మున్సిపాలిటీలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం
కారుగుర్తుకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తానని తెలిపారు. 43 కోట్లతో పనులు చేపడుతున్నామని అన్నారు.
ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్.. దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'