తెలంగాణ

telangana

కరోనా తగ్గేదెప్పుడు... మా కష్టాలుతీరేదెన్నడు

By

Published : Mar 28, 2020, 10:25 AM IST

వలస జీవులకు కరోనా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రానికి ఉపాధి కోసం వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా సౌకర్యాలు లేకపోవటం వల్ల వారు కాళ్లను నమ్ముకొని ప్రయాణం ముందుకు సాగిస్తున్నారు.

Migration of migratory organisms during lockdown in Telangana state
కరోనా తగ్గేదెప్పుడు... మా కష్టాలుతీరేదెన్నడు

బతుకు తెరువు కోసం తెలంగాణ వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజల బతుకులు అగమ్యగోచరంగా మారింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 40 రోజుల క్రితం ఖమ్మం జిల్లా వైరాకు వచ్చిన 22 మంది రాజస్థాన్ వాసులకు బతకడమే కష్టంగా మారిపోయింది.

కరోనా తగ్గేదెప్పుడు... మా కష్టాలుతీరేదెన్నడు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో వారు తమ రాష్ట్రానికి బయలుదేరటానికి సంకల్పించుకున్నారు. దీనితో వారు కాళ్లకు పని చెప్పారు. 25 కిలోమీటర్ల ప్రయాణం చేసిన వారు శుక్రవారం రాత్రి ఖమ్మం చేరుకున్నారు. వారిని ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు చేరదీసి భోజన వసతి కల్పించారు. లాక్​డౌన్ అయ్యేవరకు వసతి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి..

ABOUT THE AUTHOR

...view details