ETV Bharat / state

యూట్యూబర్​ ప్రణీత్​కు 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ - YouTuber Praneet Arrest - YOUTUBER PRANEET ARREST

YouTuber Praneet Arrest : మంగళవారం బెంగళూరులో అరెస్టు చేసిన కాంట్రవర్సీ యూట్యూబర్​ ప్రణీత్​కు నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. ప్రణీత్​పై 67బీ ఐటీ, పోక్సో, 79, 294 బీఎన్​ఎస్​ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనితో పాటు మరో ముగ్గురు నిందితులపై కూడా కేసు నమోదు చేశారు.

YouTuber Praneet Arrest
YouTuber Praneet Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 5:18 PM IST

Updated : Jul 11, 2024, 10:31 PM IST

14 days Judicial Custody for YouTuber Praneet : సామాజిక మాధ్యమంలో తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతును బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రణీత్​ను నాంపల్లిలో పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో నిందితుడికి 14 రోజులు జ్యుడీషియల్​ రిమాండ్​ను నాంపల్లి కోర్టు విధించింది. బుధవారం బెంగళూరులో యూట్యూబర్​ ప్రణీత్​ను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రణీత్​పై 67బీ ఐటీ, పోక్సో, 79, 294 బీఎన్​ఎస్​ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనితో పాటు మరో ముగ్గురు నిందితులపై కూడా కేసు నమోదు చేశారు. ఏ1గా ప్రణీత్​, ఏ2గా నాగేశ్వర్​రావు, ఏ3గా యువరాజ్​, ఏ4గా సాయి ఆదినారాయణపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. ఇలా ఎవరైనా అసభ్యకరమైన వ్యాఖ్యలు వాడితే చట్ట ప్రకారం శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.

అసలేం జరిగింది : సామాజిక మాధ్యమంలో తండ్రి-కుమార్తె వీడియోపై యూట్యూబర్ ప్రణీత్​ హనుమంతు అసభ్యంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఈ వీడియోపై మిత్రులతో చిట్​చాట్​ నిర్వహించారు. అతనితో పాటు మరో ముగ్గురు యువకులు కలసి వేర్వేరు చోట్ల కూర్చుని ఒక రీల్​పై లైవ్​లో మాట్లాడారు. ఆ రీల్​లో ఒక తండ్రి, కుమార్తె ఉంటారు. తండ్రి కూతురుపై అసభ్యకర రీతిలో అర్థం వచ్చేలా సంభాషణలు చేశారు.

ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావడంతో అది కాస్త తీవ్ర దుమారం రేపింది. సినీనటుడు సాయిదుర్గ తేజ్​ ఈ వీడియోపై ఎక్స్​ వేదికగా స్పందించారు. దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరికొంత మందికి ట్యాగ్​ చేశారు. వెంటనే దీనిపై స్పందించిన సీఎం రేవంత్​ రెడ్డి ఆ యూట్యూబర్​, మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశం మేరకు టీజీ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఈ వీడియోపై మంత్రి సీతక్క, మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్​ తీవ్రంగా స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు.

యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతును పోలీసులు ముమ్మరంగా గాలించారు. అనంతరం అతను బెంగళూరులో సైబర్​ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. అక్కడ బెంగళూరులో అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచి హైదరాబాద్​కు తీసుకువచ్చారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను గాలించి పట్టుకున్నారు. అనంతరం వారిని నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం 14 రోజుల పాటు జ్యుడీషియల్​ రిమాండ్​కు తరలించారు.

తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యంగా మాట్లాడిన యూట్యూబర్​ 'ప్రణీత్​ హనుమంతు అరెస్ట్' - YouTuber Praneeth Hanumanthu arrest

ఇట్స్ నాట్ ఫన్!! అది నోరా డ్రైనేజా? - యూట్యూబర్​పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు - YouTuber P Hanumanthu Controversy

Last Updated : Jul 11, 2024, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.