తెలంగాణ

telangana

ETV Bharat / state

మామిడి క్రయవిక్రయాలను ప్రారంభించిన సెర్ప్​

సెర్ప్​ సంస్థ మామిడిపండ్ల క్రయవిక్రయాలను ప్రారంభించింది. ధాన్యం కొనుగోళ్ల తరహాలో ఐకేపీ ఆధ్వర్యంలో మామిడిని రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. మామిడి కొనుగోళ్లు చేస్తున్న సెర్ప్​ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు వివరించారు.

Serp started mangoes marketing in telangana
మామిడి క్రయవిక్రయాలను ప్రారంభించిన సెర్ప్​

By

Published : May 7, 2020, 10:46 PM IST

గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ - సెర్ప్ మామిడిపండ్ల క్రయవిక్రయాలను ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా మామిడి ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసిన సెర్ప్... ధాన్యం కొనుగోళ్ల తరహాలో ఐకేపీ ఆధ్వర్యంలో మామిడిని రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో మగ్గించి మామిడి పండ్లను అమ్ముతోంది. మూడు వేల మెట్రిక్ టన్నుల క్రయవిక్రయాలను సెర్ప్ లక్ష్యంగా పెట్టుకోగా... ఇప్పటి వరకు 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మామిడి క్రయవిక్రయాలు, మార్కెటింగ్ వివరాలను సెర్ప్ అధికారులు గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వివరించారు. రైతులు ఇబ్బందులు పడకుండా మామిడి కొనుగోళ్లు చేస్తున్న సెర్ప్​ను మంత్రి అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details