పదో తరగతి పరీక్షలు, ఇంటర్ జవాబు పత్రాలు మూల్యాంకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. కొవిడ్‌కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు, మూల్యాంకనానికి కసరత్తు చేస్తున్నామని ఆమె తెలిపారు. జిల్లా విద్యాధికారులు, జిల్లా ఇంటర్ విద్యాధికారులతో చిత్రా రామచంద్రన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పదో తరగతి పరీక్షలు, ఇంటర్ మూల్యాంకానికి ఏర్పాట్లు - ssc exams
జిల్లా విద్యాధికారులు, జిల్లా ఇంటర్ విద్యాధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు, ఇంటర్ మూల్యాంకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రేపు విద్యాశాఖ మంత్రితో సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
పదో తరగతి పరీక్షలు, ఇంటర్ మూల్యాంకానికి ఏర్పాట్లు
పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం హైకోర్టు అనుమతి కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు ఆమె చెప్పారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు రెండింతలు చేస్తామని.. ఇంటర్ మూల్యాంకన కేంద్రాలు మూడింతలు సిద్ధం చేస్తున్నామని ఆమె వివరించారు. రేపు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనుచితం: కోదండరాం