భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లోకి కొత్తవారు వచ్చినప్పుడు నిబంధనలు పాటించి చర్యలు చేపట్టాలని అన్నారు.
ఇల్లెందు, కామేపల్లి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే - mla haripriya
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కామేపల్లి మండలాల్లో జరిగిన సర్వసభ్య సమావేశాల్లో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు.
ఇల్లెందు, కామేపల్లి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
అనంతరం ఆమె కామేపల్లి మండల కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలోనూ పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇవీ చూడండి: 'జీవో నెంబర్ 3ను కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి'