ETV Bharat / state

'జీవో నెంబర్​ 3ను కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి'

సుప్రీం కోర్టు కొట్టేసిన జీవో నెంబర్ 3పై తమను దిల్లీకి తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. వలస కార్మికుల సమస్యలపై రేపు అన్ని పార్టీల ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో జల విధానంపై ప్రభుత్వ స్పందించాలని.. త్వరలో దీనిపై విశ్రాంత ఇంజినీర్లతో సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు.

జీవో నెంబర్​ 3ను కాపాడాలి: అఖిలపక్ష నేతలు

author img

By

Published : May 11, 2020, 3:59 PM IST

హైదరాబాద్​ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల నేతల సమావేశమయ్యారు. కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేత సంపత్ కుమార్, తెదేపా నేత సాయిబాబా, తెజస అధ్యక్షులు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలు, మద్యం దుకాణాలు తెరవడం, రైతుల దాన్యం కొనుగోలు, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చేయూతనిచ్చే అంశాలపై సమావేశంలో చర్చించారు.

జీవో నెంబర్ 3 పై త్వరలోనే అఖిలపక్షం ఆధ్వర్యంలో గవర్నర్​ను కలుస్తామని నేతలు వెల్లడించారు. జీవో నంబర్ 3 ఏజెన్సీ ఏరియాల్లో మాత్రమే... మైదాన ప్రాంతాల్లో ఉన్న వారికి సంబంధం లేదన్న విషయం సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించలేకపోయిందని.. అందుకే జీవోను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న ఆదివాసీ , గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఏజెన్సీ ఏరియాల్లో విద్య , వైద్యం , మౌలిక సదుపాయాల కోసం జీవో నెంబర్ 3 తీసుకొచ్చారన్నారు. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 కొట్టేసాక తెలంగాణ, ఏపీ ప్రభుత్వం సమన్వయంతో రివ్యూ పిటిషన్ వేసేలా చూడాలన్నారు. లేదా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 పై ఆర్డినెన్స్ తీసుకురావాలని నేతలు కోరారు.

"జీవో నెంబర్​ 3ను సీరియస్​గా తీసుకొని ఏజేన్సీల్లో ఆదివాసీల విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు తోడ్పడాలి. ఎక్కడా విఘాతం కలగకుండా ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టాలి."

-పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు​

పొన్నం ప్రభాకర్​

"బతికి ఉంటే బలిసాకు తినొచ్చని కేసీఆర్​ చెప్పారు. నిజమే కానీ బతికే పరిస్థితి లేదిప్పుడు. లాక్​డౌన్​ మూలంగా బతుకు భారమైంది. వలస కూలీలు, కార్మికులు దినదినగండంగా జీవిస్తున్నారు."

-చాడ వెంకట్​ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

చాడ వెంకట్​రెడ్డి

ప్రభుత్వం సూచించిన పంట వేసిన రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తామనే ఆలోచన సరైనది కాదని తెజస అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. రైతులకు మార్కెటింగ్ విషయంలో అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఇలా పంటల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. రైతులు సాగు విషయంలో సమస్యలు తక్కువగా ఉన్న పంట వేసుకునే హక్కు ఉందన్నారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను కాపాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నీటి పంపకాల విషయంలో దక్షిణ తెలంగాణపై తెరాస కపట ప్రేమ చూపిస్తోందన్నారు. వలస కూలీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

"జీవో నెంబర్​ 3 అనేది రిజర్వేషన్ల కోసం వచ్చింది కాదు. ఆదివాసీల ప్రతిపత్తిని కాపాడుతూ వారి విద్యావకాశాలను పెంపొందించేందుకు లక్ష్యంగా వచ్చింది. ఈ జీవో వచ్చాకే అక్కడ విద్యావకాశాలు పెరిగాయి."

-కోదండరాం, తెజస అధ్యక్షుడు

కోదండరాం

ఇదీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.