తెలంగాణ

telangana

ETV Bharat / sports

ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో కోహ్లీ.. స్టోక్స్ రెండులో

ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ఆరో స్థానంలో ఉన్నాడు. ఆల్​రౌండర్ల విభాగంలో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్​స్టోక్స్ రెండో స్థానానికి ఎగబాకాడు.

స్టోక్స్
స్టోక్స్

By

Published : Jan 24, 2020, 5:03 PM IST

Updated : Feb 18, 2020, 6:18 AM IST

ఐసీసీతాజాటెస్టు ర్యాంకింగ్స్​లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇతడు 928 పాయింట్లతో ఉండగా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్మిత్ 911, లబుషేన్ 827 పాయింట్లతో వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. పుజారా, రహానే 6,8 ర్యాంకుల్లో నిలిచారు. జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన మాథ్యూస్​.. 8 స్థానాలు మెరుగుపర్చుకుని 16వ స్థానానికి చేరాడు.

బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన కమిన్స్.. 904 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 794 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టులో 120 పరుగులతో రాణించిన బెన్ స్టోక్స్.. ఆల్​రౌండర్ల విభాగంలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇదే ఇతడి కెరీర్​లో అత్యుత్తమ ర్యాంకు. వెస్టిండీస్​ ఆల్​రౌండర్ జేసన్ హోల్డర్​ టాప్​లో ఉన్నాడు. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా 3, రవిచంద్రన్ అశ్విన్ 5 ర్యాంకుల్లో నిలిచారు.

ఇవీ చూడండి.. టీ20ల్లో పాకిస్థాన్ రికార్డు.. తొలి జట్టుగా ఘనత

Last Updated : Feb 18, 2020, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details