టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. తన గర్ల్‌ఫ్రెండ్ ఎవరో ఒప్పేసుకున్నాడు. నటి నటాషా స్టాంకోవిచ్‌తో ప్రేమలో ఉన్నట్లునూతన సంవత్సరం సందర్భంగా ఇన్ స్టా వేదికగా ప్రకటించాడు.
"స్టార్టింగ్ ద ఇయర్ విత్ మై ఫైర్ వర్క్" అని నటషాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. అంతేకాకుండా ఈ పోస్టుకు ప్రేమ గుర్తును ఎమోజీగా పెట్టాడు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ దీనిపై ముందుగా స్పందించాడు.
గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' ఉందని మీడియాలో విస్తృతంగా చర్చ నడిచింది. చివరకు ఈ పోస్టుతో హార్దిక్ ఆ ఊహాగానాలను నిజం చేశాడు.
గాయం కారణంగా సెప్టెంబరు నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడీ ముంబయి క్రికెటర్. త్వరలో జరగనున్న శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో లేడు. ప్రస్తుతం కోలుకుంటున్న హార్దిక్.. భారత్-ఏ జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఈ నెలాఖరున 3 వన్డేలు ఆడనున్నాడు.
ఇదీ చదవండి: 'కొత్త ఏడాది ఏం మారదు.. మీకు గుర్తుచేస్తున్నానంతే'