తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నరాచి నుంచి రాఖీ భాయ్‌ వచ్చేశాడు.. - ప్రశాంత్ నీల్

యశ్ హీరోగా రూపొందిన 'కేజీఎఫ్'​ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్​ రాబోతుంది. తాజాగా ఈ  మూవీకి సంబంధించిన ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

yash
చాప్టర్ 2 ఫస్ట్​లుక్

By

Published : Dec 21, 2019, 6:37 PM IST

సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'కెజీఎఫ్‌ చాఫ్టర్‌ 2' ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. నరాచి చీకటి సామ్రాజ్యం నుంచి రాఖీ భాయ్‌గా యశ్ పవర్‌ఫుల్‌ లుక్స్‌తో బయటకొచ్చాడు. తొలి భాగంలో లాగే ఇందులోనూ పొడవాటి హెయిర్‌ స్టైల్‌తోనే కనిపిస్తున్నాడు యశ్.

నరాచి సామ్రాజ్యాన్ని తోటి బానిసలతో కలిసి పునర్నిర్మిస్తున్నట్లుగా అందులోని ఓ స్తంభాన్ని అక్కడి వాళ్లతో నించోబెడుతూ నోటిలో సిగరెట్‌తో స్టైలిష్‌గా నడిచొస్తుస్తున్నట్లుగా దర్శనమిచ్చాడు యశ్​. పోస్టర్‌పై "రీ బిల్టింగ్‌ యాన్‌ అంపైర్‌" అనే పవర్‌ఫుల్‌ కొటేషన్‌ని ఇచ్చారు.

చాప్టర్ 2 ఫస్ట్​లుక్

ఈ చిత్రంలో ప్రతినాయకుడు అధీరా పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ కనిపించబోతున్నాడు. ఇప్పటికే దత్​కు సంబంధించిన ఫస్ట్‌లుక్ బయటకొచ్చింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో శరవేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2020 ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవీ చూడండి.. సల్మాన్​ను 'భాయ్'​ అని పిలిచిన భూమిక.. ఏం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details