తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'విజయ్.. నా స్నేహితుడు.. ప్రేమికుడు.. భర్త' - గీతగోవిందం విజయ్-రష్మిక

హీరోయిన్ రష్మిక.. ఇటీవలే జరిగిన 'బిహైండ్​ వుడ్స్ అవార్డ్స్' కార్యక్రమంలో వ్యాఖ్యతలు అడిగిన ఓ ప్రశ్నకు కొంటెగా జవాబిచ్చింది. తన ఫ్రెండ్, లవర్​, భర్త.. విజయ్ అంటూ చెప్పింది.

'విజయ్.. నా స్నేహితుడు.. ప్రేమికుడు.. భర్త'
హీరోయిన్ రష్మిక

By

Published : Dec 30, 2019, 4:23 PM IST

'ఛలో'తో టాలీవుడ్​లో అరంగేట్రం చేసిన రష్మిక.. 'గీత గోవిందం'తో స్టార్‌ హీరోయిన్​గా మారిపోయింది. ఇందులో నటించిన విజయ్-రష్మిక జోడీకి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కింది. ఈ ఏడాది వచ్చిన 'డియర్‌ కామ్రేడ్‌'తో ఈ జంట.. మరోసారి సినీప్రియుల మది దోచింది.

ఇటీవలే జరిగిన 'బిహైండ్‌ వుడ్స్‌ గోల్డ్‌మెడల్‌ అవార్డ్స్‌'లో వీరిద్దరూ.. ఉత్తమ నటుడు, నటిగా బంగారు పతకాలు అందుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి వ్యాఖ్యాతలు రష్మికను ఓ ఆసక్తికరమైన ప్రశ్నడిగారు. అందుకు తగ్గట్లుగానే సమాధానమిచ్చిందీ భామ.

'చిత్రసీమలో ఉన్నవారిలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ప్రేమికుడిగా ఎవరిని ఎంచుకుంటారు? స్నేహం ఎవరితో చేస్తారు?' అని అడగ్గా.. మూడు ప్రశ్నలకు కలిపి విజయ్‌ పేరునే చెప్పింది. అయితే ఆమె చెప్పిన విజయ్‌ ఒక్కరు కాదులేండి. ఆమె తన భర్తగా విజయ్‌ దళపతిని, ప్రేమికుడిగా విజయ్‌ సేతుపతిని, స్నేహితుడిగా విజయ్‌ దేవరకొండను ఎంచుకుంటుందట. ఇలా మొత్తంగా తన జీవితాన్ని విజయ్‌తోనే ముడిపెట్టుకున్నట్లుగా కొంటెగా జవాబిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇది చదవండి: రష్మికను జడ్జ్​ చేయడం మానండి: రక్షిత్​

ABOUT THE AUTHOR

...view details