తెలంగాణ

telangana

ట్రంప్​ పర్యటనకు ముందు కశ్మీర్​పై యూఎస్​ సెనేటర్ల మెలిక

By

Published : Feb 13, 2020, 2:57 PM IST

Updated : Mar 1, 2020, 5:26 AM IST

భారత్​లో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం తరువాత మానవ హక్కులు, మత స్వేచ్ఛ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయాలని అమెరికా విదేశాంగ శాఖను కోరింది అక్కడి సెనేటర్ల బృందం. ఇందుకోసం ప్రత్యేక రాష్ట్ర విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. మరో పది రోజుల్లో అధ్యక్షుడు ట్రంప్ భారత్​లో పర్యటించునున్న నేపథ్యంలో ఈ వివరాలు సేకరిస్తోంది.

us seeks assesments of human rights and religious freedom in India
ట్రంప్​ పర్యటనకు ముందు కశ్మీర్​పై యూఎస్​ సెనేటర్ల మెలిక

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ భారత పర్యటనకు ముందు కశ్మీర్​ అంశంపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు అమెరికా సెనేటర్లు. కశ్మీర్​లో మానవ హక్కులు, భారత్​లో మత స్వేచ్ఛ పరిస్థితిని సమీక్షించాలని ఆ దేశ విదేశాంగ శాఖను కోరారు.

భారత్​ పరిస్థితి ఏంటి?

తమను తాము "భారతదేశ చిరకాల మిత్రులు" గా అభివర్ణించుకున్నారు నలుగురు సెనేటర్లు క్రిస్ వాన్ హోలెన్, టాడ్ యంగ్, రిచర్డ్ జె డర్బిన్, లిండ్సే ఓ గ్రాహమ్​. బుధవారం అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు లేఖ రాశారు.

భారత ప్రభుత్వం కశ్మీర్​లో సుదీర్ఘకాలంపాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిందని, 70 లక్షల మందికి వైద్య సేవలు, వ్యాపారం, విద్యను పొందడంలో అంతరాయం కలిగించిందని లేఖలో పేర్కొన్నారు నలుగురు చట్టసభ్యులు. వందలాది మంది కశ్మీరీలు ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్నారని గుర్తుచేశారు. కశ్మీర్​లో పరిస్థితులు సహా భారత్​కు సంబంధించిన వేర్వేరు అంశాలపై సమీక్ష కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పాంపియోను అభ్యర్థించారు నలుగురు సెనేటర్లు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఈ నెల 24, 25న భారత్​లో పర్యటించనున్నారు.

ఇదీ చదవండి:దివ్యాంగులకు ఉచిత పాఠశాల.. 32 ఏళ్లుగా విద్యాబోధన

Last Updated : Mar 1, 2020, 5:26 AM IST

ABOUT THE AUTHOR

...view details