Keir Starmer Takes Charge As UK PM : యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) 58వ ప్రధానిగా కియర్ స్టార్మర్ బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఫలితాలు వెలువడిన తర్వాత యూకే ప్రధానమంత్రిగా కియర్ నియమితులయ్యారు. అనంతరం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్3ను స్టార్మర్ కలిశారు. కియర్ నియామకాన్ని కింగ్ ఛార్లెస్ ఆమోదించారు. ఆయన సమక్షంలో నూతన ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రజలనుద్దేశించి స్టార్మర్ మాట్లాడారు.
'బ్రిటన్‌ను పునర్నిర్మిస్తాం- అర్జెంటుగా పని మొదలు పెడతాం'
"మన దేశం మార్పుకోసం, పునర్నిర్మానం, ప్రజాసేవ చేసే రాజకీయాల పునరాగమనం కోసం నిర్ణయాత్మకంగా ఓటు వేసింది. మా ముందు ఉన్న పని చాలా అత్యవసరం, ఈరోజే ప్రారంభింస్తాము. ప్రజలు చేసిన త్యాగాలకు, రాజకీయ నాయకుల నుంచి వారు పొందుతున్న సేవలకు మధ్య ఇంత పెద్ద అంతరం పెరిగినప్పుడు, దేశంలో నిస్పృహకు దారితీస్తుంది. మంచి భవిష్యత్తుపై ఆశ, నమ్మకం హరించుకుపోతుంది. అయితే ఇప్పుడు మనం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని మాటలతో కాదు, చేతలతోనే తొలగించొచ్చు. మీ ప్రభుత్వం దేశంలోని (బ్రిటన్) ప్రతి ఒక్క పౌరుడిని గౌరవంగా చూస్తోంది. మీరు నిన్న లేబర్ పార్టీకి ఓటు వేస్తే, మన దేశాన్ని పునర్నిర్మించడానికి బాధ్యత వహిస్తాము. కానీ మీరు లేబర్‌కు ఓటు వేసినా, వేయకపోయినా, ముఖ్యంగా మీరు చేయకపోయినా నా ప్రభుత్వం మీకు సేవ చేస్తుంది. దేశం ముందు తర్వాతే పార్టీ అన్నట్లుగా మా పరిపాలన ఉంటుంది. మార్పుకు సంబంధించిన పని వెంటనే మొదలవుతుందనడంలో సందేహం లేదు. బ్రిటన్‌ను పునర్నిర్మిస్తాం అనడంలో సందేహం లేదు. ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ అవకాశాల మౌలిక సదుపాయాలను పునర్నిర్మిస్తాము.' కియర్ స్టార్మర్ అని అన్నారు.
#WATCH | " ...have no doubt that work of change begins immediately, have no doubt that we will rebuild britain...," says keir starmer as he delivers his first speech as uk prime minister outside 10, downing street.
— ANI (@ANI) July 5, 2024
(source: reuters) pic.twitter.com/WBiIiNP5Lu
రిషి సునాక్ ఘనతను తక్కువగా అంచనా వేయకూడదు : స్టార్మర్
ఈ సందర్భంగా యూకే మాజీ ప్రధాని రిషి సునాక్‌ను కూడా కియర్ స్టార్మర్ ప్రశంసించారు. 'మన దేశం(యూకే) మొదటి బ్రిటిష్ ఆసియా ప్రధానిగా ఆయన(రిషి సునాక్) సాధించిన ఘనత, ఆయన చేసిన అదనపు కృషిని ఎవరూ తక్కువగా అంచనా వేయకూడదు. దానికి ఈరోజు మేము ట్రిబ్యూట్ ఇస్తున్నాము. ఆయన అంకితభావాన్ని, కృషిని గుర్తించాము' అని అభినందించారు స్టార్మర్.
స్టార్మర్, సునాక్‌పై మోదీ స్పెషల్ ట్వీట్స్
బ్రిటన్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న కియర్ స్టార్మర్‌ను అభినందిస్తూ సామాజిక మాధ్యమంలో ప్రధాని మోదీ పోస్టు చేశారు. అన్ని రంగాల్లో భారత్-యూకే సంబంధాల బలోపేతం దిశగా నిర్మాణాత్మక సహకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన రిషి సునాక్‌ను ప్రశంసిస్తూ, ప్రధాని మోదీ మరో పోస్టు చేశారు. యూకేను పాలించడంలో సునాక్ అద్భుతమైన పనితీరు కనబరిచినట్లు అభినందించారు. రెండు దేశాల మధ్య బలమైన బంధం నెలకొల్పే దిశగా చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు ప్రయాణం బాగుండాలని ఆకాంక్షిస్తూ సునాక్‌తో పాటు ఆయన కుటుంబానికి ప్రధాని మోదీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Heartiest congratulations and best wishes to @Keir_Starmer on the remarkable victory in the UK general elections. I look forward to our positive and constructive collaboration to further strengthen the India-UK Comprehensive Strategic Partnership in all areas, fostering mutual…
— Narendra Modi (@narendramodi) July 5, 2024
Thank you @RishiSunak for your admirable leadership of the UK, and your active contribution to deepen the ties between India and the UK during your term in office. Best wishes to you and your family for the future.
— Narendra Modi (@narendramodi) July 5, 2024
రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోవడం వల్ల ప్రధాన మంత్రి పదవికి రిషి సునాక్ రాజీనామా చేశారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్3ను కలిసి రిషి సునాక్ తన రాజీనామాను సమర్పించారు. అంతకు ముందు అక్కడి మీడియాతో మాట్లాడిన సునాక్ బ్రిటిష్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఎన్నికల్లో తన పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు సునాక్ తెలిపారు. అలాగే కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా తప్పుకోనున్నట్లు ప్రకటించారు. పార్టీ కొత్త నాయకుడిగా వేరొకరు బాధ్యతలు చేపట్టేవరకు ఆ పదవిలో కొనసాగుతానని సునాక్ స్పష్టం చేశారు.
"దేశ ప్రజలకు నేను ముందుగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఈ పదవి కోసం నా సర్వస్వం ఇచ్చాను. కానీ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం మారాలని మీరు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. మీ తీర్పే అంతిమ తీర్పు. మీ కోపాన్ని, నిరాశను నేను విన్నాను. ఈ ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నాను. ఈ ఫలితాన్ని అనుసరించి పార్టీ (కన్జర్వేటివ్ పార్టీ) నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. వెంటనే కాదు పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకున్నాక తప్పుకుంటాను. ఇది చాలా కఠినమైన రోజు. ఈ దేశం (బ్రిటన్) ప్రపంచంలోనే ఉత్తమమైన దేశం. బ్రిటిష్ ప్రజలకు నా ధన్యవాదాలు." అని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ అన్నారు.
#WATCH | Rishi Sunak gives his last speech as UK Prime Minister outside 10, Downing Street
— ANI (@ANI) July 5, 2024
" ...to the country, i would like to say first and foremost, i am sorry. i have given this job my all but you have sent a clear signal that the government of the united kingdom must change… pic.twitter.com/4MqUAiGyIi
రాజకీయాల్లోకి వచ్చిన 9ఏళ్లలోనే ప్రధాని పీఠం- ఎవరీ కీర్ స్టార్మర్? - who is Keir Starmer