తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రజల నుంచి తీసుకుంటున్నారు.. ప్రభుత్వానికి చెల్లిస్తలేరు! - gst officers rides on tax pending companies

ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించని సంస్థలపై కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం దృష్టిసారించింది. హైదరాబాద్‌లో... ఏకకాలంలో 21 సంస్థల్లో మూకుమ్మడి సోదాలు నిర్వహించారు. 40 కోట్ల రూపాయలు మేర జీఎస్టీ, సేవాపన్ను ఎగవేసినట్లు గుర్తించారు. మరిన్ని సంస్థలపై దాడులు నిర్వహించేందుకు నిఘా విభాగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ప్రజల నుంచి తీసుకుంటున్నారు.. ప్రభుత్వాని చెల్లిస్తలేరు!
ప్రజల నుంచి తీసుకుంటున్నారు.. ప్రభుత్వాని చెల్లిస్తలేరు!

By

Published : Dec 20, 2019, 5:57 AM IST

Updated : Dec 20, 2019, 6:49 AM IST

వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత... పలు సంస్థలు ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి చెల్లించడం లేదు. ఇలాంటి సంస్థలు దేశ వ్యాప్తంగా లక్షల్లో ఉన్నాయి. హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోనూ వేలాది సంస్థలు ఎగవేతకు పాల్పడుతున్నట్లు కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం గుర్తించింది. 2017 ఏప్రిల్‌ కంటే ముందు నుంచి ఇప్పటి వరకు సేవా పన్ను చెల్లించని సంస్థలను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌(డీజీజీఐ) గుర్తించింది.

పెద్ద సంస్థలవే బకాయిలు!

విద్యాసంస్థలు, వినోదాన్ని అందించేవి, ఆతిథ్యం, మౌలిక సదుపాయాలు కల్పించేవి, సినీ, స్థిరాస్తి, చిట్ ఫండ్స్, రవాణా ఏజెంట్లు, బ్యాంకింగ్ ఏజెంట్లు లాంటి 12 రంగాల్లో బకాయిలు ఎక్కువగా ఉన్నట్లు జీఎస్టీ నిఘా విభాగం గుర్తించింది. దీన్ని బట్టి పెద్ద సంస్థలు జీఎస్టీ సరిగా చెల్లించటం లేవని అధికారులు అనుమానిస్తున్నారు. ఇలాంటి సంస్థల్లో సోదాలు నిర్వహించి రూ.34 కోట్లకుపైగా జీఎస్టీ బకాయిలను గుర్తించారు. మరో రూ.4.5 కోట్ల సేవా పన్ను, సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం బకాయిలను గుర్తించారు. సోదాల్లో జీఎస్టీ బృందాలు స్వాధీనం చేసుకున్న రికార్డులను విశ్లేశించే పనిలో పడ్డాయి.

హైదరాబాద్‌ జోన్‌లో ఆరు వేలు...

ఎప్పటి నుంచో పేరుకుపోయిన సేవాపన్ను, ఎక్సైజ్‌ సుంకాలను వసూలు చేసేందుకు కేంద్రం సబ్‌కా విశ్వాస్‌ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ నెలాఖరుకు ఉన్న గడువులోగా బకాయిలు చెల్లించే సంస్థలకు... చెల్లించాల్సిన మొత్తంలో 60 నుంచి 70 శాతం రాయితీ కల్పించనుంది. హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో... ఆరు వేలకు పైగా సంస్థలు బకాయిలు చెల్లించనట్లుగా గుర్తించారు. విభాగానికి ఒకట్రెండు సంస్థలపై సోదాలు చేయడం ద్వారా... ఆయా సంస్థల్లో భయం పుట్టి సబ్‌కా విశ్వాస్‌ పథకం వైపు ఆకర్శితులవుతున్నారని జీఎస్టీ నిఘా విభాగం అధికారులు చెబుతున్నారు. నెలాఖరు లోపు మరిన్ని దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఇవీ చూడండి: నష్టాల్లో నడుస్తున్న డిపోలను గట్టెక్కించేందుకు..'డిపోల దత్తత'

Last Updated : Dec 20, 2019, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details